‘లైఫ్‌ వైరో ట్రీట్‌’తో కోవిడ్‌కు కళ్లెం

కోవిడ్‌ వైరస్‌తోపాటు అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లనూ సమర్థంగా నియంత్రించే ‘లైఫ్‌ వైరో ట్రీట్‌’ అనే వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు బాలానగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(నైపర్‌) సంస్థ వెల్లడించింది. నైపర్, లైఫ్‌ ఆక్టివ్స్, సుప్రీం ఇండస్ట్రీస్‌ సంయుక్త ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను శుక్రవారం నైపర్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అనంతరం నైపర్‌ డైరెక్టర్‌ డా.శశిబాలాసింగ్‌ మాట్లాడారు. వ్యాక్సిన్‌ పనితీరు వివరించారు. నెబ్యులైజర్‌ సహాయంతో మందు పనితీరు ప్రదర్శించారు.