అంబేడ్కర్ కే ఆదర్శ ప్రాయుడు ఈయన
అణగారిన ప్రజల హక్కుల పోరాట యోధుడు
ఫూలే జయంతి సందర్భంగా..
విజయవాడ,ఏప్రిల్11(ఆర్‌ఎన్‌ఎ):సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడైనన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్ 11న జన్మించాడు.
కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకు గురైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జోతిరావ్ గోవిందరావు పూలే.
సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడైన పూలే మహారాష్ట్రకు చెందినవాడు. ఆయన భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన అంటరాని ప్రజల హక్కుల కోసంపోరాడాడు.
మహారాష్ట్రలోని పూణెళి జిల్లాలో ఖానవలి ప్రాంతంలో 1827 ఏప్రిల్ 11న జోతిరావ్ పూలే జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు. కాలక్రమేణా పీష్వా పరిపాలనాకాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు పూలే గా మార్పు చెందింది.
ALSO READ: మరోసారి ప్రమాద ఘంటికలు
సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తనువు చాలించింది. 7 సంవత్సరాల వయస్సులో పూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు.అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ పూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ.
ప్రతిరోజూ నిద్రకుపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునే వాడు. జోతిరావ్ చదువుపట్ల ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్, ఇంటి ప్రక్కనేఉండే ఒక కైస్త్రవ పెద్దమనిషి జోతిరావ్ తండ్రిని ఒప్పించి ఆయనవిద్యాభ్యాసం కొనసాగేలా చేశారు.
ఆయన 1841లో స్కాటిష్ మిషన్ పూణెళిలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు. సదాశివ భిల్లాల్ గోవింద్ అనే బ్రాహ్మణునితో పూలే పరిచయం జీవితకాల స్నేహంగా మారింది.
చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించాడు ఫూలే జోతిరావు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజి, జార్జ్ వాషింగ్టన్ ల జీవిత చరిత్రలు ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి.
థామస్ రచించిన ’మానవ హక్కులు’ పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది