Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అమూల్‌ కన్నా మన నందిని పాలే…

రసవత్తరంగా కన్నడ రాజకీయాలు
డికె శివకుమార్‌, సిద్దరామయ్యల మధ్య పోటీ
తామే సిఎంలమంటూ పరోక్ష సందేశాలు
బిజెపిని ఇరుకున పెట్టేలా అమూల్‌ పై విమర్శలు
బెంగళూరు,ఏప్రిల్‌11:

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాజకీయాలు రోజుకో మలుపు తిరుగు తున్నాయి. ఎత్తులు పె ఎత్తులు వేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో వర్గ రాజకీయాలు మరోమారు తెరపైకి వచ్చాయి.

ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి సీటుపై కీలక నేతలు కన్నేశారు. దీంతో ఒకరికి మించి ఒకరు రాజకీయం నడుపుతున్నారు. అలాగే బిజెపిని దెబ్బకొట్టేందుకు అమూల్‌ పాల వ్యహారాన్ని కూడా కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది.

అమూల్‌ కన్నా మన నందిని పాలే బెటర్‌ అంటూ..లోకల్‌ సెంటిమెంట్‌ తీసుకుని వచ్చారు. దీంతో గుజారతీ అమూల్‌ వద్దనేలా ప్రధానిమోడీ, అమిత్‌ షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇకపోతే కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం బలంగా ఉంది.

ఈ క్రమంలో అప్పుడే ముఖ్యమంత్రి పదవిపై కేపీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌, మాజీ సీఎం సిద్ధరామయ్య మధ్య పోటీ నెలకొంది. ఈ ఇద్దరు నేతలు సీఎం అభ్యర్థి తామే అంటూ నేరుగా ప్రకటించక పోయినా అవకాశం వచ్చిన ప్రతిసారి తానే సీఎం క్యాండెట్‌ అని ఎవరికి వారు సందేశాలు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే పేరును ప్రస్తావించి.. కన్నడ రాజకీయాన్ని తన వైపునకు తిప్పుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పేరును తెరపైకి తీసుకొచ్చారు.

ALSO READ: మరోసారి ప్రమాద ఘంటికలు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. ఖర్గే కోసం తన ఛాన్స్‌ వదులుకుంటానని డీకే శివకుమార్‌ వ్యాఖ్యానించారు. దీంతో దళిత సీఎం చర్చ తెరపైకి వచ్చింది. డీకే శివకుమార్‌ ఖర్గేకు మద్దతు ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఇదే సమయంలో.. దళిత సీఎం, స్థానిక వర్సెస్‌ వలస రాజకీయం చర్చ మొదలైంది. అయితే.. డీకే శివకుమార్‌ ఊరికే ఈ కామెంట్స్‌ చేయలేదని.. సిద్ధరామయ్య కు చెక్‌ పెట్టడానికే ఖర్గే పేరును ప్రస్తావించారనే టాక్‌ వినిపిస్తోంది. ఇటు తాను ముఖ్యమంత్రి అయితే ఖర్గే ఆధ్వర్యంలో పనిచేయడానికి ఇష్టపడతానని డీకే ప్రకటించారు. అక్కడితో ఆగకుండా.. గతంలోనూ సీనియర్‌ నేతలకు అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు.

డీకే శివకుమార్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై.. అటు సిద్ధరామయ్య రియాక్ట్‌ అయ్యారు. హై కమాండ్‌ ఏ డిసిషన్‌ తీసుకున్న అంతా చేతులు కట్టుకొని నిలబడతామని చెప్పారు. ఈ క్రమంలోనే బిజెపిని దెబ్బ కొట్టడానికి అమూల్‌ పాల వ్యాపారాన్ని కూడా వాడుకుంటున్నారు.

కర్నాటకలో అమూల్‌ వర్సెస్‌ నందిని బ్రాండ్‌ మధ్య రాజకీయ రగడ కొనసాగుతోంది. అమూల్‌ పాలు, పెరుగు అమ్ముతాం. బెంగళూరులో మేం బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తున్నాం అని గుజరాత్‌ కో ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ అమూల్‌ చేసిన ట్వీట్‌కర్నాటకలో రాజకీయ దుమారానికి దారితీసింది.

అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. అమూల్‌ ప్రకటనను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కర్నాటక రైతులందరూ కలిసి కర్నాటక మిల్క్‌ ఫెడరేషన్‌ (కేఎంఎఫ్‌)ను ఏర్పాటు చేసుకుని నందిని బ్రాండ్‌ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. అమూల్‌ వస్తే కేఎంఎఫ్‌ పరిస్థితేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అమూల్‌, కేఎంఎఫ్‌ విలీనంపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ విమర్శిస్తున్నది.

అమూల్‌ ప్రకటనను నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌)తో పాటు కన్నడ అనుకూల సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. బెంగళూరులో కర్నాటక రక్షణ వేదికతో పాటు పలు సంఘాల లీడర్లు రోడ్డెక్కారు. నందిని ప్రతిరోజూ ముంబైకి 2.5 లక్షల లీటర్లు, హైదరాబాద్‌కు 1.5 లక్షల లీటర్లు, ఏపీకి మరో బ్యాచ్‌ పాలను సప్లై చేస్తుంది.

విదేశాలకు కూడా నందిని ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. మొత్తం అమ్మకాలలో 15శాతం కర్నాటక బయటే అవుతాయి. మరో అడుగు ముందుకు వేసి అమూల్‌పాలు ఎవరూ కొనొద్దంటూ మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. కేఎంఎఫ్‌, అమూల్‌ విలీనం అడ్డుకుంటామని ప్రకటించారు.

రాష్ట్రంలో నందిని ప్రోడక్ట్స్‌ కృత్రిమ సృష్టించారని జేడీ(ఎస్‌) విమర్శించింది. ప్రతిపక్షాల కామెంట్లను బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ ఖండిరచారు. అమూల్‌ కర్నాటకలో ప్రవేశించడం లేదని, కేఎంఎఫ్‌తో విలీనమవ్వట్లేదని చెప్పారు. మొత్తంగా కర్నాక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.