అంతరాష్ట్ర​ బస్సులు: భేటీ కానున్న మంత్రులు

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడపడానికి ఉన్న ప్రతిబంధకాలను తొలగించే లక్క్ష్యంతో ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు పేర్ని నాని, పువ్వాడ అజయ్ ఈనెల 14న (సోమవారం) హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు, సంబంధిత ఉన్నత అధికారులు హాజరుకానున్నారు. ఎలాగైనా ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించేందుకు ఉన్న అవకాశాలను ఇరు రాష్ట్రాల రవాణా మంత్రులు చర్చించనున్నారు. (రైట్‌ రైట్‌.. రైతు బజార్)