Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌… లియో

భారీ అంచనలాలతో విజయ్‌ లియో
’ఖైదీ’, ’విక్రమ్‌’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ దేశమంతటా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న మూవీ లియో . కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ 50శాతానికి పైగా పూర్తయింది. కశ్మీర్‌, కొడైకెనాల్‌ వంటి ప్రాంతాల్లో ’లియో’ ను చిత్రీకరించారు. ఈ మూవీలో ఓ స్టార్‌ హీరో నటించనున్నారని తెలుస్తోంది. విజయ్‌కు విలన్‌గా కనిపించనున్నారని సమాచారం అందుతుంది.

ALSO READ: పెళ్లి బరాత్‌ అంటే తెలంగాణలో మామూలుగా….
’లియో’ లో కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ధనుష్‌ నటించనున్నారని వదంతులు షికార్లు కొడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.

చెన్నైలోని శాలిగ్రామంలో ఉన్న ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఈ సీన్స్‌ను షూట్‌ చేయనున్నారని రూమర్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. విక్రమ్‌ సినిమాలోని రోలెక్స్‌ పాత్ర మాదిరిగానే ధనుష్‌ రోల్‌ ’లియో’ లో ఉండనుందట.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మేకర్స్‌ నుంచి త్వరలోనే రానుందట. ధనుష్‌ ఈ మధ్య కొన్ని సినిమాల్లో నెగెటివ్‌ రోల్స్‌ చేశారు. ’ది గ్రే మ్యాన్‌’, ’నానే వరువెన్‌’ వంటి చిత్రాల్లో గ్రే షేడ్స్‌ ఉన్న పాత్రలు పోషించారు.

’లియో’ ను సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ భారీ బ్జడెట్‌తో రూపొందిస్తుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌ పాత్రను పోషిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

అర్జున్‌, సంజయ్‌ దత్‌, మన్సూర్‌ అలీ ఖాన్‌, మిస్కిన్‌, గౌతమ్‌ విూనన్‌, మాథ్యూ థామస్‌, కతిర్‌, ప్రియా ఆనంద్‌, బాబు ఆంథొనీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ’లియో’ పై భారీ బజ్‌ ఉంది.

అందుకు తగ్గట్టుగానే సినిమా కోలీవుడ్‌ హిస్టరీలోనే అత్యధికంగా రూ.400కోట్లకు పైగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది.