Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పెళ్లి బరాత్‌ అంటే తెలంగాణలో మామూలుగా….

దసరాలో కీర్తి సురేశ్‌ బరాత్‌ వీడియో విడుదల
పెళ్లి బరాత్‌ అంటే తెలంగాణలో మామూలుగా ఉండదు. మాస్‌ స్టెప్పులు..ఊరమాస్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌తో దుమ్మురేపుతారు. చిన్నా పెద్దా తేడా లేకుండా డీజే పాటలు వినిపించాయంటే చాలు..కాలు ఆటోమేటిక్గా ఆడాల్సిందే.

అలాంటి బరాత్‌ డ్యాన్సుతో స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ అదరగొట్టింది. ఊరమాస్‌ స్టెప్పులతో కేక పుట్టించింది. తెలంగాణా సంప్రదాయలు, సంస్కృతికి దసరా చిత్రంలో పెద్ద పీట వేశారు. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా బరాత్‌ డాన్స్‌ ని పెట్టారు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల.

ALSO READ: నిఖిల్‌ స్పై సినిమా రూ.40 కోట్లకు అమెజాన్‌ కి

సినిమలో వెన్నెల పాత్రలో నటించిన నటించిన కీర్తిసురేశ్‌..ఓ సీన్‌ లో భాగంగా పెళ్లి కూతురు గెటప్‌లో బరాత్‌లో చేసే డ్యాన్స్‌ చేసింది. కిక్‌ ఎక్కించే స్టెప్పులతో హైలెట్‌గా నిలిచింది.

కీర్తిసురేశ్‌ డ్యాన్స్‌ చేస్తుంటే థియేటర్లలో ఫ్యాన్స్‌ విజిల్స్‌ వేస్తున్నారు. మూవీలో చవ్కిూల అంగీ వేసి సాంగ్‌ ఇన్నాళ్లు ట్రెండిరగ్‌లో ఉంటే…ప్రస్తుతం కీర్తిసురేష్‌ మాస్‌ డాన్స్‌ దాన్ని బీట్‌ చేసింది.

చిత్రంలో తన పెళ్లి సమయంలో కీర్తి రెచ్చిపోయి డ్యాన్స్‌ చేసింది. కీర్తి సురేష్‌ తీన్మార్‌ స్టెప్పుల వీడియోను మేకర్స్‌ విడుదల చేయడంతో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

కీర్తి సురేశ్‌ డ్యాన్స్‌ కు ఫిదా అవ్వని వారుండరు. మాస్‌ స్టెప్పులతో…బ్యాండ్‌ బీట్‌కు తగ్గట్లు డ్యాన్స్‌ చేస్తూ ఫ్యాన్స్‌ మనసులు కొల్లగొట్టింది మహానటి.దసరా మూవీ శ్రీరామనవమి రోజును విడుదలైంది.

మొదటి షో నుంచే సూపర్‌ హిట్టు టాక్‌ తో దూసుకు పోతుంది.సింగరేణి ఏరియాలోని వీర్లపల్లి గ్రామం చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో తెరకెక్కినంది.