Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నిఖిల్‌ స్పై సినిమా రూ.40 కోట్లకు అమెజాన్‌ కి

చిత్ర పరిశ్రమలో ఇప్పుడంతా పాన్‌ ఇండియా టాక్‌ నడుస్తోంది. ప్రతి నటుడు పాన్‌ ఇండియా కథలు కావాలని అంటున్నారని, ఆలా అయితేనే చేస్తామని కూర్చున్నారని పరిశ్రమలో అంటున్నారు.

అడివి శేష్‌, నిఖిల్‌, నాని , నవీన్‌ పోలిశెట్టి ఒకరేంటి ఇప్పుడున్న యువ నటులంతా కూడా పాన్‌ ఇండియా కథలు అయితే చేస్తున్నారని ఒక వార్త నడుస్తోంది. అయితే మొన్న ఈమధ్య విడుదల అయిన నాని సినిమా ’దసరా’ కూడా నాని పాన్‌ ఇండియా సినిమా అనే చాలా ప్రచారం చేసాడు.

ALSO READ: రివెంజ్‌ కథతో రవితేజ రావణాసురుడు

నార్త్‌ లో చాలా నగరాలూ తిరిగి ఆ సినిమా గురించి చాలా ప్రచారం చేసాడు, కానీ ఆ సినిమా తెలంగాణాలో తప్ప వేరే దగ్గర అంచనాలకు తగ్గట్టుగా నడవలేదు. ’దసరా’ అన్ని భాషల్లోనే ఒకేసారి విడుదల చేశారు.

దీనికన్నా ముందు నిఖిల్‌ సిద్దార్థ్‌ నటించిన ’కార్తికేయ 2’ తెలుగులో ముందు విడుదల అయి మంచి విజయం సాధించింది. ఆ తరువాత అదే సినిమాని హిందీ లో విడుదల చేస్తే అక్కడ కూడా బ్రహ్మాండంగా నడిరచింది.

నిఖిల్‌ కి మొదటి వందకోట్ల సినిమా గా నమోదయింది. నాని కన్నా నిఖిల్‌ చాలా ముందున్నాడు. ఎందుకంటే నిఖిల్‌ ’కార్తికేయ 2’ పాన్‌ ఇండియా లెవెల్‌ లో విజయం సాధించటమే కాకుండా, రెవిన్యూ కూడా బాగా రాబట్టింది.

ఇప్పుడు నిఖిల్‌ రాబోయే సినిమా ’స్పై’ కూడా పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఆ సినిమా విడుదల కాకముందే నాన్‌ థియేట్రికల్‌ హక్కులు అప్పుడే రూ.40 కోట్లకు అమెజాన్‌ కి అమ్మేశారు. అంటే నిఖిల్‌ ’స్పై’ కి అంత డిమాండ్‌ ఉందన్నమాట. ఆ సినిమా కూడా చాలా గ్రాండ్‌ గా తీస్తున్నారు అని కూడా వినికిడి.