Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వార్నర్‌ సేనకు హ్యాట్రిక్‌ ఓటమి

ఢల్లీిపై రాజస్థాన్‌ భారీ విక్టరీ
న్యూఢల్లీి,ఏప్రిల్‌8(ఆర్‌ఎన్‌ఎ): ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ రెండో విజయం సాధించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఢల్లీి క్యాపిటల్స్‌ను 57 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిరచింది.

ఓపెనర్లు జోస్‌ బట్లర్‌(79), యశస్వీ జైస్వాల్‌(60), అర్ధ శతకాలు బాదడంతో సంజూ సేన భారీ స్కోర్‌ చేసింది. ఢల్లీి కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (65) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.

ట్రెంట్‌ బౌల్ట్‌ స్వింగ్‌ బౌలింగ్‌తో ఢల్లీిని వణికించాడు. టాపార్డర్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఢల్లీి కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (65) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.లక్ష్య ఛేదనలో ఢల్లీి 9 వికెట్ల నష్టానికి 142 రన్స్‌ మాత్రమే చేసింది.

భారీ టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఢల్లీి క్యాపిటల్స్‌కు తొలి ఓవర్‌లోనే పెద్ద షాక్‌. ట్రెంట్‌ బౌల్ట్‌ దెబ్బకు ఖాతా తెరవక ముందే రెండు ప్రధాన వికెట్లు కోల్పోయింది. రెండో బంతికే పృథ్వీ షా(0) ఔటయ్యాడు. మూడో బంతికి మనీశ్‌ పాండే ఎల్బీగా వెనుదిరిగాడు. రిలీ రస్సో(14) స్వీప్‌ షాట్‌ ఆడబోయి అశ్విన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దాంతో 36 రన్స్‌కే ఢల్లీి మూడు కీలక వికెట్లు కోల్పోయింది.

లలిత్‌ యాదవ్‌(38), డేవిడ్‌ వార్నర్‌(65) ధాటిగా ఆడి స్కోర్‌ వంద దాటించారు. వీళ్లు నాలుగో వికెట్‌కు 64 రన్స్‌ జోడిరచారు. ఆ తర్వాత పావెల్‌(2), అక్షర్‌ పటేల్‌(2) తొందరగా వెనుదిరిగారు. రాజస్థాన్‌ ఢల్లీిని 142 పరుగులకే కట్టడి చేసింది.

ALSO READ: మిస్టరీ స్పిన్‌తో అదరగొట్టిన ఢిల్లీ కుర్రాడు

రాజస్థాన్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌, చాహల్‌ మూడేసి వికెట్లు తీశారు. అశ్విన్‌ రెండు, సందీప్‌ శర్మ ఒక వికెట్‌ పడగొట్టారు.

మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్లు జోస్‌ బట్లర్‌(79), యశస్వీ జైస్వాల్‌(60), అర్ధ శతకాలు బాదారు. ఆఖర్లో హెట్‌మెయిర్‌(39) సిక్స్‌లతో విరుచుకు పడ్డాడు. బట్లర్‌, యశస్వీ తొలి వికెట్‌కు 98 రన్స్‌ జోడిరచారు. ప్రమాదకరమైన ఈ జోడీని ముఖేశ్‌ కుమార్‌ విడదీశాడు.

జైస్వాల్‌ ఔటయ్యాక పరుగుల వేగం తగ్గింది. సంజూ శాంసన్‌(0), రియన్‌ పరాగ్‌(7) నిరాశ పరిచారు. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి బట్లర్‌ ఫిప్టీకి చేరువయ్యాడు. ఈ విధ్వంసక ఓపెనర్‌ 33 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 రన్స్‌ స్కోర్‌ చేశాడు. హెట్‌మెయిర్‌తో కలిసి స్కోర్‌ వేగం పెంచాడు.

హెయిట్‌మెయిర్‌ ఆఖర్లో చెలరేగి ఆడడంతో రాజస్థాన్‌ భారీ స్కోర్‌ చేయగలిగింది. ఢల్లీి బౌలర్లలో ముఖేశ్‌ కుమార్‌ రెండు వికెట్లు తీశాడు. కుల్దీప్‌ యాదవ్‌, రోవ్‌మన్‌ పావెల్‌కు ఒక్కో వికెట్‌ దక్కింది.

ఢల్లీి బౌలర్లను రాజస్థాన్‌ రాయల్స్‌ ఊచకోత కోసింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగులు చేసింది.

ఓపెనర్లు యశస్వీ జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌ అర్థ సెంచరీలతో చెలరేగడంతో ..రాజస్థాన్‌ భారీ స్కోరు సాధించింది.