విమెన్ సేఫ్టీ వింగ్‌తో కంపెనీల ప్రత్యేక దృష్టి

హైదరాబాద్ : కరోనా సమయంలో సైబర్ వేధింపులు ఎక్కువయ్యాయని సీపీ సజ్జనార్ తెలిపారు. ఉద్యోగాల్లో కొత్తగా చేరిన మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సదస్సు కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులు కోసం కంపెనీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబరాబాద్ పోలీస్ ఎస్‌సీఎస్‌సీ ద్వారా మహిళా ఉద్యోగుల కోసం రక్షణ ఏర్పాట్లు చేశామని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ లెర్నిగ్ మాడ్యూల్ ద్వారా మహిళ ఉద్యోగుల రక్షణ కోసం ఇది పనిచేస్తుందన్నారు.