మిస్టరీ స్పిన్‌తో అదరగొట్టిన ఢిల్లీ కుర్రాడు
రేసుగుర్రంలా దూసుకు వచ్చిన సుయాష్ శర్మ
అరంగేట్రంలోనే అదరగొట్టిన ఢల్లీి కుర్రాడు
కోల్‌కతా,ఏప్రిల్7(ఆర్‌ఎన్‌ఎ): ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ఒక్క ప్రదర్శనతో ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోయే అవకాశం ఆటగాళ్లకు ఐపీఎల్ కల్పిస్తోంది.
రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, సిరాజ్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే.
ఈ సీజన్‌లో ఇప్పటికే తిలక్ వర్మ , సాయిసుదర్శన్ వంటి ఆటగాళ్లు తమ ఆటతీరుతో మాజీల ప్రశంసలు అందుకున్నారు.
తాజాగా కోల్‌కతాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌తో యువ స్పిన్నర్ సుయాష్ శర్మ అందరి దృష్టినీ తమవైపు తిప్పుకున్నాడు.
గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో ఢల్లీి కుర్రాడు, 19 ఏళ్ల సుయాష్ శర్మను కేకేఆర్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.
ALSO READ: అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసిన రంగమార్తాండ
ఇప్పటివరకు అతడికి తుది జట్టులో స్థానం దక్కలేదు. గురువారం జరిగిన మ్యాచ్‌లో సుయాష్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి బెంగళూరు భరతం పట్టాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి.. అందరి ప్రశంసలు అందుకున్నాడు ఈ 19 ఏళ్ల ఢల్లీి స్పిన్నర్.
సుయాష్ శర్మ ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడటమే కాదు.. సీనియర్ ప్లేయర్లతో కలిసి ఆడటం కూడా ఇదే ఫస్ట్ టైం. సుయాష్ శర్మ ఇప్పటి వరకు లిస్టు`ఏ, ఫస్ట్ క్లాస్, టీ20 మ్యాచ్‌లు ఏవి కూడా ఆడలేదు. కేవలం ఢల్లీి తరుపున అండర్`25 స్టేట్`ఎ జట్టుకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు.
మొదట బ్యాట్స్ మెన్ గా తన కెరీర్ ప్రారంభించిన సుయాష్.. తన కెరీర్ లో ఏదైనా ప్రత్యేకంగా ఉండాలని రిస్ట్ స్పిన్ బౌలింగ్‌లోకి అడుగు పెట్టాడు. గతేడాది కోల్ కత్తా టీం సుయాష్ ను కొనుగోలు చేసింది. అప్పటినుంచి కోల్ కత్తా క్యాంపులో సీనియర్ల, తోటి ఆటగాళ్ల సలహాలు పొందుతూ.. ఈ స్థాయికి ఎదిగాడు.
మ్యాచ్ అనంతరం కోల్ కత్తా కెప్టెన్ నితీష్ రాణా మాట్లాడుతూ.. సుయాష్ శర్మకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ. తనకొచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోగలడు. గతేడాది నుంచి నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ మంచి ప్రదర్శన కనబరిచాడు.
దాంతో జట్టు అతనిపై పూర్తి నమ్మకం ఉంచి ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఛాన్స్ ఇచ్చిందని చెప్పాడు. ఇలాªూలుగు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
తన మిస్టరీ స్పిన్‌తో దినేష్ కార్తీక్, అనూజ్, విల్లేలను అవుట్ చేశాడు. మాజీ క్రికెటర్లు సైతం సుయాష్ బౌలింగ్ యాక్షన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సుయాష్ ప్రదర్శనపై మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా ప్రశంసలు కురిపించాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సుయాష్ అద్భుతంగా వినియోగించుకున్నాడని తెలిపాడు.