పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ పల్లెల సత్తా
27 అవార్డుల్లో 8 తెలంగాణ పల్లెలకు పురస్కారాలు
కెసిఆర్ దార్శనికత అని అభినందించిన మంత్రులు
హైదరాబాద్,ఏప్రిల్7(ఆర్‌ఎన్‌ఎ): జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ పల్లెలు సత్తా చాటాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో తెలంగాణ అత్యధిక అవార్డులను గెలుచు కుంది. మొత్తం 27 అవార్డుల్లో 8 పురస్కారాలను తెలంగాణ పల్లెలు కైవసం చేసుకున్నాయి.
ఆరోగ్య పంచాయతీ విభాగంలో మొదటి స్థానం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గౌతమ్‌పూర్‌కు దక్కింది. తగినంత నీరు కలిగిన పంచాయతీ విభాగంలో జనగామ జిల్లా నెల్లుట్లకు ప్రథమస్థానం లభించింది. సామాజిక భద్రతా విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని కొంగట్‌పల్లి మొదటి స్థానంలో నిలిచింది.
మహిళా స్నేహ పూర్వక విభాగంలో సూర్యాపేట జిల్లా ఐపూర్ మొదటి స్థానంలో నిలిచింది. పేదరికం లేని, మెరుగైన జీవనోపాధి పంచాయతీ విభాగంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని మాన్‌దొడ్డి గ్రామపంచాయతీకి రెండో స్థానంలో నిలిచింది. పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ విభాగంలో వికారాబాద్ జిల్లా చీమల్దారి గ్రామానికి రెండో స్థానం లభించింది. పచ్చదనం, పరిశుభ్రత విభాగంలో పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పురి మూడో స్థానం లభించింది. స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు మూడోస్థానం లభించింది.
అవార్డులు రావడంపై మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు. 27 జాతీయ పంచాయతీ అవార్డులో రాష్టాన్రికి 8 వచ్చాయి. నాలుగు కేటగిరిల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. గ్రావిూణాభివృద్ధి సీఎం కేసీఆర్ దార్శనికతకు అవార్డులే నిదర్శనం అని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అధికారులకు మంత్రి హరీష్ రావు అభినందనలు తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం ఉత్తమంగా నిలిచి మరోసారి మెరిసిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
READ ALSO బీటలు వారుతున్న కాంగ్రెస్ కంచుకోట
దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయంలోనూ తెలంగాణ నంబర్ వన్, ఉత్తమ గ్రామ పంచాయతీలు, 100 శాతం ఓడీఎఫ్‌లోనూ తెలంగాణ ప్లలెల్లు నంబర్ వన్‌గా నిలిచాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్ మానసపుత్రిక పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఆయన బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
తెలంగాణలోని పల్లెలకు మరోసారి తొమ్మిది జాతీయ అవార్డులు రావడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి, గ్రావిూణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్,కేటీఆర్ మార్గనిర్దేశకత్వరలో పల్లె ప్రగతికి అవార్డులు దక్కినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయ అవార్డుల ప్రకటన అనంతరం మంత్రి ఎర్రబెల్లి స్పందించారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఈ అవార్డుల రావడానికి కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, డీఆర్డీవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులు, పంచాయతీరాజ్ సిబ్బంది, సర్పంచ్‌లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలకు మంత్రి అభినందనలు తెలిపారు.
అవార్డులు వచ్చిన గ్రామాలు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, రాని గ్రామాలు అవార్డులు తెచ్చుకోవడానికి పట్టుదలతో పని చేయాలని సూచించారు. గతంలోనూ స్వచ్ఛ,పారిశుధ్య, ఇ`పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు,బహిరంగ మల,మూత్ర రహిత రాష్ట్రం, ఉత్తమ ఆడిటింగ్ వంటి అంశాలలో అవార్డులు వచ్చాయన్నారు.
వందశాతం నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా,ప్లోరైడ్ రహిత రాష్ట్రంగా,అనేకానేక అవార్డులు,రివార్డులు వచ్చాయన్నారు. ఆయా అంశాల్లో తెలంగాణ రాష్టాన్న్రి ఆదర్శంగా తీసుకోవాలని మిగతా రాష్టాల్రకు కేంద్రం సూచించిందని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు , కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి పేర్కొన్నారు.