ఆదివాసుల ఆనవాళ్లు లేకుండా చేయడమే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర..??

*నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివాసివీరుడు రాంజీగోండు మ్యూజియం ఎప్పుడు..!?*
*తొలి భారత స్వాతంత్య్ర*
*పోరాటయోధుడురాంజీగోండు*
*చరిత్రను మరిచిన కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు*
*రేపు రాంజీగోండు163వ వర్ధంతి*
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో ఏప్రిల్ 07
(నిజం న్యూస్)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల చరిత్ర గడ్డ…నిర్మల్ లో చరిత్రక ఆనవాళ్లు ఉన్న రాంజీ గోండు చరిత్రను లేకుండా చేయడమే ఈ పాలకుల కుట్రలు, ఎన్నో చరిత్రకమైన కట్టడాలు, గుర్తుండేలా చేస్తున్న ప్రభుత్వాలు, కానీ నాటి బ్రిటిష్ సిపాయిలు, నిజాం ప్రభుత్వంపై తిరగబడ్డ గోండ్ బిడ్డ గుర్తింపు లేకుండా చేయడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్టలనేమో..!! ఎన్నో హామీలు ఇస్తూ అమలు చేయకుండా ఆదివాసుల పట్ల వివక్ష చూపుతూ అడవిలో నుండి వెళ్లగొడుతూ ఆదివాసులను కనుమరుగు చెయ్యాలని.ఈ ప్రభుత్వాల కుట్ర, చరిత్ర గల చరిత్ర గల ఆదివాసుల త్యాగాలను ,చరిత్రను, ప్రపంచ దేశాలు గుర్తించిన తన దేశ పాలకులు మాత్రం వ్యతిరేకంగా నే ఉన్నాయని చెప్పకనే చెప్పుకోవచ్చు. నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చిపోయిన, జిల్లాలోని మంత్రి అల్లోల హామీలు గుప్పిస్తున్న అమలు ఎక్కడ..!! స్వార్థం కోసం స్వార్థ రాజకీయాల కోసం ఆనవాళ్లు లేకుండా చేసి , ప్రజలు చరిత్రను మరిచేలా చేస్తున్నారు తప్ప,అక్కడ ఏది కూడా గుర్తింపు చేసే పరిస్థితి లేదు. ఇది మన తెలంగాణ దుస్థితి..!!!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతనిర్మల్ జిల్లా కేంద్రంలో తొలిభారతస్వతంత్రయోధులు పోరాటాలు రాంజీగోండు చరిత్రనుతెలిపే
విధంగా జిల్లా కేంద్రంలో ఐదు
ఎకరాల భూమిలోమ్యూజియం
ఏర్పాటు చేస్తామని ఆదివాసులు కిఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చినట్లేనా..??
బీటలు వారుతున్న కాంగ్రెస్ కంచుకోట
రాష్ట్రప్రభుత్వం చేయని పని కేంద్ర ప్రభుత్వం చేస్తుందని జిల్లా
పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా ఇచ్చిన హమి కూడా
నీటిమూటలేనా..? టిఆర్ఎస్ ప్రభుత్వం చేయని పని బిజెపి ప్రభుత్వంచేస్తుందని, ఆదివాసి తొమ్మిదితెగలు అదిలాబాద్ జిల్లా నుండిబీజేపీకి పార్లమెంట్ సభ్యుని పంపినప్పటికీ బీజేపీ మాత్రం ఆదివాసులుచరిత్రమర్చిపోయింది. కెసిఆర్ నియంత పాలన అంటూ కేంద్రప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తామని అదిలాబాద్ ఉమ్మడి జిల్లాపర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా ఇచ్చిన హామీ కూడాఅమలులోకి రాకపోవడం, ఆదివాసీ సంఘాల నుండి విమర్శలువ్యక్తమవుతున్నాయి. ఆదివాసుల చరిత్ర నుకనుమరుగు చేసే విధానంగాకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుకుట్రపడుతున్నాయని, మరోపోరాటానికి సిద్ధం కావాలని ఆదివాసి తెగల సంఘాలు ఓ నిర్ణయానికివచ్చినట్టు తెలుస్తోంది. భారత ప్రథమ స్వాతంత్య్ర పోరాటం అంటేనేసహజంగా స్మరించేది 1857 సిపాయిల తిరుగుబాటు. ఆ పోరులో
తెలంగాణ నేల కూడా భాగమైంది. అందులోనూ నిర్మల్ ప్రాంతం
ప్రముఖంగా నిలిచింది. ఇక్కడ జరిగిన ఓ మహత్తర ఘటన..
చరిత్రపుటల్లో ఎక్కడా లేకపోవడం శోచనీయం. రాంజీ గోండు సహా
వెయ్యిమంది వీరులను నిర్మల్లో ఒకే మర్రిచెట్టుకు ఉరితీయడం దేశ
చరిత్రలోనే ఎక్కడా.. జరగని ఓ అతిపెద్ద ఘటన, అలాంటి వీరుడైనరాంజీని, ఆవెయ్యిమందికి ఇప్పటికీ గుర్తింపు లేదు. 1836,1860
కాలంలో మధ్య భారతదేశంలో గోండ్వానా ప్రాంతంలో భాగమైన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలకు మర్సికోల్ల రాంజీగోండునాయకత్వం వహించేవాడు. మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్,
అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసించే అనేకమంది గిరిజన తెగలసమూహాలతో గోండ్వానా రాజ్యం ఉండేది. ఇది బ్రిటిష్ పాలకులురాక పూర్వమే ఏర్పడింది. గోండుల పాలన సా.శ. 1240-1750వరకు సుమారు 5 శతాబ్దాలపాటు కొనసాగింది.
గోండురాజులలో చివరివాడైన నీలకంఠ్ (సా.శ. 1735-49)
నిమరాఠీలుబంధించిచంద్రాపూర్ను ఆక్రమించుకున్నారు. దీంతో
గోండ్వానా ప్రాంతం మరాఠీల ఆధీనమైంది. అనంతర కాలంలో ఈప్రాంతాన్ని ఆంగ్లేయులు దక్కించుకున్నారు. అప్పటి నుంచి
గోందులపాలనఅంతమై,ఆంగ్లేయులు, హైదరాబాద్ నైజాం పాలన
ఆరంభమైంది. వీరి దౌర్జన్యాలు ఊర్లను దాటి అడవుల్లోకి
చొచ్చుకువచ్చాయి. 1836 1860 మధ్యకాలంలో నాటి జనగాం
(ఆసిఫాబాద్) కేంద్రంగా చేసుకుని రాంజీగోండు బ్రిటిష్ సైన్యాలను
దీటుగా ఎదుర్కొనేవాడు. ఆంగ్లేయులను ఎదుర్కొన్న తొలి గిరిజనపోరాట యోధుడు కూడా రాంజీనే. అదేసమయంలో ఉత్తర
భారతదేశంలో ప్రథమ స్వతంత్ర సంగ్రామం ఉవ్వెత్తున ఎగిసింది.
బ్రిటిష్సైన్యంతోఝాన్సీలక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంతియాతోపీ,
రావు సాహెట్లు పోరాడారు. అయితేఆంగ్లేయులబలగాలముందువారు నిలువలేక తలోదిక్కు తమ బలగాలతో విడిపోయారు.
తాంతియాతోపే అనుచరులైన రోహిల్లాలు (రోహిల్ ఖండ్ ప్రాంతానికి9మంది
చెందినవారు)పెద్దసంఖ్యలోమహారాష్ట్రలోనిబీదర్, పర్బనీ, తెలంగాణఔరంగాబాద్,
ప్రాంతంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకిప్రవేశించారు. అప్పట్లో వీరు మహారాష్ట్రలోనిఅజంతా, బస్మత్, లాతూర్, మఖ్తల్, తెలంగాణలోనినిర్మల్తాలూకాలను పోరాట కేంద్రాలుగాచేసుకున్నారు. అదే సమయంలో నిర్మల్ తాలూకాలోఉంటున్న ఆంగ్లేయ కలెక్టర్,ఇక్కడితాలూకార్ఆగడాలు పెరిగిపోవడంతోరాంజీగోండుఈప్రాంతంపై దృష్టి పెట్టాడు. తన గిరిసైన్యానికి,రోహిల్లా దండు తోడైంది. వారంతా రాంజీ
సారథ్యంలో తిరుగుబాటు లేవదీశారు. రాంజీ
నాయకత్వంలో వెయ్యిమంది రోహిల్లాలు,గోండు, నాయకపోడ్, కోలాం.మన్నేవారు, పరాదన్, ఆంద్, కలిసి నిర్మల్ సమీపంలోని అడవులు,కొండలు, చెరువులను ఆధారంగాచేసుకుని బ్రిటిష్, నైజాం
పాలకులను ముప్పతిప్పలు పెట్టి, గొలుసుకట్టు చెరువుల నీళ్లు
తాగించారు. నిర్మల్ కలెక్టర్ హైదరాబాద్లోని రెసిడెంటు
సమాచారం ఇచ్చాడు. ఆయన ఆదేశాల మేరకు కర్ణాటక ప్రాంతంలోనిబల్లారిలో గల స్వదేశీదళం కల్నల్ రాబర్ట్ ఆధ్వర్యంలో నిర్మల్
ప్రాంతానికి చేరుకుంది. వారు ఆధునిక ఆయుధాలతో వచ్చినా
రెండుసార్లు ఆదివాసీ వీరులు ఇక్కడి భౌగోళిక పరిస్థితులను ఆసరాగాచేసుకుని ఓడించారు. ఈప్రాంతంలో వీరిని ఓడించడం కష్టమని
ఆనాటి పాలకులు దొంగదెబ్బతీసి, డబ్బు గోదావరినది సమీపంలోని సోన్ ప్రాంతంలో రాంజీగోండుతో సహా వెయ్యిమందిని పట్టుకున్నారు.వారందరినీ ఈడ్చుకుంటూ తీసుకువచ్చి, నిర్మల్ శివారులో ఎల్ల పెళ్లి
వెళ్లే రోడ్డులో ఉన్న ఊడలదిగిన మహా మర్రిచెట్టుకు ఉరితీశారు.
ఈఘటన 1860 ఏప్రిల్ 9న జరిగినట్లు చెబుతారు. అలా..
వెయ్యిమందిని ఉరితీసినందునే ఆ మర్రిచెట్టు వెయ్యిఉరుల మర్రిగా
పేరొందింది. ఆచెట్టు 1995లో గాలివానకు నేలకొరిగింది. కొన్ని
శతాబ్దాలుగా రాంజీ గోండ్ పోరాటాన్ని, వెయ్యిమంది అమరులత్యాగాల్ని ఏ పాలకుడూ గుర్తించలేదు. తెలంగాణ ఉద్యమం
సమయంలో పలు సంఘాల నాయకులు కలిసి నిర్మల్ పట్టణంలోచైనీగేట్ వద్ద రాంజీగోండు విగ్రహం, వెయ్యిటరుల మర్రి సమీపంలో
ఓ అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు. గతంలో నిర్మల్
రాంజీగోండు పేరిట మ్యూజియం, అమరుల స్మారకార్థం
అమరధామం నిర్మిస్తామని చెప్పినా.. అమలుకు నోచుకోలేదు. 2021సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని
కేంద్ర హెూంశాఖమంత్రి అమితా నిర్మల్ వచ్చారు. ఇక్కడి
రాంజీగోండు సహా వెయ్యిమంది అమరులకు నివాళులర్పించారు.
దీంతో రాంజీ సహా వెయ్యిమంది అమరుల ప్రాణత్యాగాల చరిత్ర
ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ.. ఇప్పటికీ వారిస్మారకార్ధం ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. చరిత్ర పుటల్లో.పాఠ్యపుస్తకాల్లో ఎక్కడా.. వారికి చోటివ్వకపోవడం శోచనీయం.ఎలాంటి చరిత్ర లేని వ్యక్తులకు జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తూ
సెలవులు ప్రకటిస్తున్నారు. భారత దేశపు స్వతంత్ర పోరాట యోధుడుకిసెలవు ప్రకటించారు. పార్లమెంట్లో అసెంబ్లీ హాల్లో కనీసం విగ్రహాలుఏర్పాటు చేయని పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. భారతదేశంలో35 కోట్లు జనాభ ఉన్న ఆదివాసులను ఓటు బ్యాంకువినియోగించుకుంటూ, చరిత్రను పాఠ్యపుస్తకాలలో ఎక్కకుండాఅడ్డుపడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచిచరిత్రను కనుమరుగు కాకుండా చూడాలని, ఆదివాసులుకోరుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో అదివాసు చరిత్రను ఉద్యమంఏర్పాటుచేసి బావి ప్రపంచానికి తెలిసేవిధంగా చూడాలనిఆదివాసులుకోరుతున్నారు.
*వెంకగారి భూమయ్య*
*సీనియర్ జర్నలిస్ట్ వర్తమాన రాజకీయాలపై విశ్లేషణ*