Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

టి సేవ్ ఉద్యమం కోసం విపక్షాలు కలిసి రావాలి: వై ఎస్ షర్మిల

ప్రత్యేక కథనం: సి.హెచ్.ప్రతాప్

తెలంగాణ ప్రభుత్వం పై అన్ని విపక్షాలను కలుపుకొని ఐక్య పోరాటం చేయాలని వైఎస్ షర్మిల కొత్త వ్యూహ రచనకు సిద్ధం అయ్యారు. ఇతీవల బి ఆర్ ఎస్ ప్రభుత్వం తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తున్న క్రమంలో తాజాగా రూటు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పై ఒంతరి పోరాటం చెస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పాదయాత్ర సమయంలో టార్గెట్ చేసే విమర్శలు గుప్పించిన వైయస్ షర్మిల ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు
విపక్షాల ఐక్యత ఒక్కటే శరణ్యం అని భావిస్తునట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో ఇరుద్యోగం ఎక్కువై లక్షలాది మంది యువత నిరాశా నిస్పృహలలో కూరుకుపోతున్నందున నిరుద్యోగుల భవిష్యత్తు కోసం జెండాలు వేరైనా ఒకే అజెండా పనిచేద్దాం. పార్టీలకు అతీతంగా సేవ్ తెలంగాణా పేరిట ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని లకిసి పోరాటం చేద్దాం. రాజకీయాల కంటే మన బిడ్డల భవిష్యత్తు మనకు ముఖ్యం. ఏప్రిల్ 10వ తేదీన సమావేశమై ఉమ్మడి కార్యాచరణను రూపొందిద్దాం. దయచేసి అన్ని పార్టీలు కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా అని వై ఎస్ షర్మిళ అన్ని విపక్ష పార్టీలకు పిలుపు నివ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయంశం అయ్యింది.ఇటీవల బండి సంజయ్ కు, రేవంత్ రెడ్డికి కలిసి పోరాటం చేద్దామని ఫోన్ చేసిన షర్మిల, తాజాగా ఉమ్మడిగా పోరాటం చేద్దాం రండి అంటూ మరో ప్రతిపాదనను ప్రతిపక్షాల ముందు పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఉమ్మడి పోరాటం చేయడానికి టీ సేవ్.. తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ ఎంప్లాయ్మెంట్ అనే ఫోరాన్ని తాను ప్రతిపాదిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలుగా జెండాలు వేరైనా నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఒకే అజెండా గా పని చేద్దామంటూ వైయస్ షర్మిల పిలుపునిచ్చారు. రాజకీయాల కంటే మన బిడ్డల మన భవిష్యత్తు మనకు ముఖ్యమని, పార్టీలకు అతీతంగా టి సేవ్ ద్వారా పోరాటం చేద్దామని వైయస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. బి ఆర్ ఎస్ పరిపాలనలో నిరుద్యోగులకు తొమ్మిదేళ్లుగా అన్యాయం జరుగుతోందని, వ్యక్తిగత అజెండాలు, విబేధాలను పక్కనపెట్టి అందరూ ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఉందని వైయస్ షర్మిల ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ప్రజా ఉద్యమంలో ప్రతిపక్షాలతో పాటు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, తెలంగాణా ఉద్యమ పార్టీలు, మేధావులు, ఉపాద్యాయ సంఘాలు కూడా కలిసి రావాలని వైయస్ షర్మిల విజ్ఞప్తి చేస్తున్నారు. మరి కేసీఆర్ ప్రభుత్వం పై పోరాటానికి సరికొత్త పంధా ఎంచుకున్న వైఎస్ షర్మిలకు ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తాయా? మూకుమ్మడి పోరాటానికి అందరూ కలిసి వస్తారా లేదా అనే విషయం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అయితే రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా కొత్త ఉద్యోగాలకు రూపకల్పన జరిగిందని, తమ ప్రభుత్వ హాయంలో లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలను ఇవ్వడం జరిగిందని కొత్త గణాంకాలతో బి ఆర్ ఎస్ ప్రభుత్వం విపక్షాలపై ఎదురుదాడికి సన్నద్ధం అవుతొంది.