Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణలో మళ్ళీ కరోనా మహమ్మరి విజృంభణ

ప్రత్యేక కధనం: సి.హెచ్.ప్రతాప్

దేసంలో, తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితి అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. భారతదేశంలో గత 24 గంటల్లో 3,016 తాజా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఒక్కసారిగా 40% కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. రోజువారి పాజిటివిటీ రేటు కూడా ఒక్కసారిగా పెరిగింది. 2.7% రోజువారి పాజిటివ్ రేటు, 1.71% వారం పాజిటివిటీ రేటు నమోదయింది. ఇక దేశంలో తాజాగా 15 కరోనా మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ముగ్గురు, హిమాచల్ ప్రదేశ్ లో గత 24 గంటల వ్యవధిలో ఒకరితో పాటు, కేరళలో సవరించిన డేటా తో 8 మంది మరణాలు కలిపి 15మరణాలు నమోదు అయినట్టుగా సమాచారం.

 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండగా, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా మూడు జిల్లాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య సాఖ గణంకాల ప్రకారం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం 12వ స్థానంలో ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో గత రెండు వారాలు నుండి ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని గణాంకాల ద్వారా తెలుస్తొంది. ఇంతకుముందు 0.5% గా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు తెలంగాణ రాష్ట్రంలో రెండు శాతం వరకు నమోదవుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మూడు జిల్లాలలోనూ ప్రతి వంద మందిలో నలుగురైదుగురికి కరోనా పాజిటివ్ వస్తుందని, దీంతో క్షేత్ర స్థాయిలో కరోనా కట్టడికి దృష్టి సారించాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫ్లూఎంజా కేసులు వణికిస్తున్నాయి. దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, గొంతు ఇన్ఫెక్షన్ తో వేల సంఖ్యలో బాధితులు ఆస్పత్రుల చుట్టు పరుగులు తీస్తున్నారు. ఇదే సమయంలో కరోనా కేసులు కూడా నమోదు అవుతుండడం ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.ప్రభుత్వ సూచన మేరకు టెస్టుల సంఖ్య పెంచామని, కరోనా పాజిటివిటీ రేటు ఒక శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.టెస్టింగ్, ట్రేసింగ్ పెంచి కరోనా కట్టడికి రంగంలోకి దిగారు.