Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అక్రమ నిర్మాణల కు అడ్డగా ముత్తంగి

 

హద్దులు మించి అంతస్థుల నిర్మాణాలు

రెచ్చిపోతున్న భవన యాజమానులు

పటాన్ చెరువు మార్చి 29 (నిజం న్యూస్)

హద్దులు మించి భవన నిర్మాణాలు నడిపిస్తున్న యజమానులు అధికారుల అండదండతో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ముత్తంగి గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే భారీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు ప్రజా ప్రతినిధుల నాయకుల భక్తులకు అధికార యంత్రాంగం తగ్గుతున్నారా…? ఉన్నోడికి ఒక న్యాయం పేదోడికి మరో న్యాయంలా పంచాయతీ అధికారులు వ్యవహరిస్తున్నారు. పేదోడు అనుమతి లేకుండా చిన్న గుడిసె వేసుకుంటేనే ఆగమేఘాల మీద వాలిపోయే అధికారులు అనుమతులు లేకుండా భవన అంతస్తులు నిర్మిస్తున్న వారిని కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయం గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు

ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మా బిల్డింగ్ వైపు ఏ అధికారి రాడని వస్తేనేమి మాకు అండగా ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

ముత్తంగి గ్రామంలో అక్రమ కట్టడాలు జోరుగా సాగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు .

ముత్తంగి గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను చూసి అధికారులు బాధ్యత మరిచి ముడుపులు మాయలో ఊగుతూ బిల్డింగ్ యజమానుల దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు పాల్పడుతూ ఉన్నారని చెప్పడానికి అక్రమ నిర్మాణాలు చూస్తే తెలుస్తుంది . ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై మీడియాలో కథనాలు వచ్చిన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముందు ముందు ఇలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది.