అయ్యా…! విద్యుత్ స్తంభాలు వేయండి

డిడి లు కట్టి నెలలు, సంవత్సరాలు అయినాయి కనికరించండి సార్ లు
పట్టింపులేని మాటలతో కాలం గడిపేస్తున్నా యంత్రాంగము
ముధోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 27 (నిజం న్యూస్)
రైతే రాజు అనే నానుడి కాని రైతుకీ ఎమి తెలియదని చిన్నచూపు.మాటలతో సమయం కాస్త గడుపుతు, రైతుల సమస్యలను పట్టుంచుకొని విద్యుత్ అధికారులు.పంట చేనులో నీరు లేనిది వ్యవసాయం వ్యర్థమని రైతన్నలు పంటల దిగుబడిని పెంచుకునేందుకు బోరు బావులు వేసుకుంటున్నారు. వేసుకున్న బోరు బావులతో పంట చేనులో నీరు పారాలంటే విద్యుత్ తప్పనిసరి.రైతుకు కొత్త విద్యుత్ లైన్ కొరకు ఎదురుచూపు చూడాల్సి వస్తుంది. డిడి లు కట్టి సంవత్సరాలు, ఓఅర్సీ లు చెల్లించి పదుల మాసాలు గడుస్తున్న నూతన విద్యుత్ లైన్ కొరకు అన్నదాతకు తిప్పలు తప్పడంలేవు.ముధోల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో ఇలాంటి దుస్థితి ఉంది. ప్రభుత్వం రైతుల అభివృద్ధి పట్ల ఎంతో ప్రాముఖ్యతనిస్తూ 24 గంటల పాటు ఉచిత వ్యవసాయ విద్యుత్ తో పాటు వారికీ విద్యుత్ లైన్ ల కొరకు అవసరమైన అన్ని పనులు సకాలంలో నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.ముధోల్ సర్కిల్ ప్రాంతంలో కొందరు అప్పు తీసుకొని బోర్లు వేసుకున్నారు.డి.డి లు కట్టినాము కదా రేపో మాపో విద్యుత్ స్తంభాలు వేసి కరెంట్ వస్తది కదా అని అనుకున్నారు.నెలల పాటు తిరుగుతే ప్రస్తుతం పనులు ప్రారంభం అయ్యాయి.విద్యుత్ వస్తుంది అనుకునే సంభరం రైతన్నకి వారం కూడ దక్కలేదు.నూతన లైన్ ల ఏర్పాటు కు సరిపడా పోల్స్ లేవని సమయానికి పనులు నిర్వహించ లేమని విద్యుత్ అధికారులు చేతులు ఏత్తేశారు.పోల్స్ లెవనో,తీగలు లేవనో అధికారులు రైతన్నకి అన్యాయం జరుగుతూంది. అధికారుల చుట్టూ తిరిగి తమ సమస్యను ఎంత మొరపెట్టుకున్న తీరడం లేదని నిరాశకు లోనవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నంతధికారులు స్పందించి సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు.