బిఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం

ఎల్ బి నగర్ నియోజకవర్గం కొత్త పేట లో బీ ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు గా ఎల్ బీ నగర్ ఎం ఎల్ ఏ డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి,ఎం ఎల్ సి ఎల్ రమణ హాజరు అయ్యారు.ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు సైనికుడి వలె పని చేసి వచ్చే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ జెండా ఎల్ బి నగర్ గడ్డ మీద ఎగరాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఎం ఎల్ సి బీ దయానంద్, మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాష్ గౌడ్,సాగర్ రెడ్డి,డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షులు లింగాల రాహుల్ గౌడ్,సీనియర్ నాయకులు లింగాల నాగేశ్వర రావు,విశ్వేశ్వర,మహేష్ రెడ్డి,ఉదయ్ గౌడ్,జోగు రాములు,, రుద్రాల స్వామి,విజయ్ గౌడ్, మల్లెపాక యాదగిరి,ఇటికాల యాధగిరి, జంగిర్ బాబు గౌడ్,తదితరులు పాల్గొన్నారు.ఎటువంటి విబేధాలు లేకుండా కార్యకర్త లు ఐకమత్యం గా ఉండాలి అని కోరారు.