జాతీయ రహదారి పై ప్రమాధకరంగా యూ టర్న్ లు
గ్రేటర్ హైదరాబాద్,ఎల్ బి నగర్,మార్చి 27 ( నిజం న్యూస్ ):-
నిత్యం రద్దీ గా ఉండే విజయవాడ జాతీయ రహదారి పై యూ టర్న్ లు ప్రమాద కారంగా ఉన్నాయి.వివరాల్లోకి వెళ్తే..హయత్ నగర్ లోని బావర్చి హోటల్,విజయలక్ష్మి వైన్స్ ఎదురుగా ఉన్న యూ టర్న్ చాలా ప్రమాదకరం గా ఉండి.గుంత లు పడ్డాయి.హయత్ నగర్ నుండి ఎల్ బీ నగర్ వైపు వెళ్ళే అన్ని వాహనాలు అక్కడినుండి యూ టర్న్ తీసుకోవాలి.కానీ అక్కడ రోడ్ మొత్తం చిద్రం అయ్యి ద్విచక్ర వాహన దారులు అదుపు తప్పి కింద పడే అవకాశం ఉంది.ట్రాఫిక్ పోలీసుల కు ద్విచక్ర వాహన దారుల ఫోటో లు తీసి చలాన్ వేయడం మీద ఉన్న శ్రద్ద రోడ్ లు బాగు చేయడం మీద ఎందుకు లేదని పలువురు వాహన దారులు ప్రశ్నిస్తున్నారు.రోడ్ ల పరిస్థితి ఫోటో లు తీసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం లో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారు అని పలువురు మండిపడుతున్నారు.స్థానిక కార్పొరేటర్ మరియు ఎం ఎల్ ఏ ,ప్రజాప్రతినిధులు,అధికారులు సత్వరం స్పందించి ఈ రోడ్ మరమ్మతు చేయించాలని పలువురు వాహన దారులు కోరుతున్నారు.ఆ గుంతలు పూడ్చి మళ్లీ బి టి వేసి లెవల్ చేసి ప్రమాదాల బారినుండి కాపాడాలని కోరుతున్నారు.