నేడు కార్పెంటర్స్ డే

గ్రేటర్ హైదరాబాద్,ఎల్ బి నగర్ ,మార్చి 27 ( నిజం న్యూస్ ). :-
చేతి వృత్తుల్లో బాగమైన వడ్రంగి కార్మికులను కాపాడాలని వడ్రంగి కార్మికులు కోరుతున్నారు.ఈ రోజు కార్పెంటర్ డే సందర్భముగా వడ్రంగి కార్మికుల చరిత్రను ,వాల్ల బాధను సమాజం దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ఉద్దేశ్యం తో నిజం న్యూస్ విశ్లేషణాత్మక కథనం మీ ముందుకు తీసుకువస్తున్న ధి.. వివరాల్లోకి వెళ్తే..పూర్వ కాలం నుండి రైతుల కు,వడ్రంగి వృత్తి కార్మికులకు విడదీయరాని అనుబంధం ఉంది వ్యవసాయానికి అవసరం అయిన నాగలి నీ తయారు చేసేది వడ్రంగి కార్మికుడు,అటవీ ప్రాంతం లో అయితే బిల్లుడు కర్ర,మైదాన ప్రాంతం లో అయితే తుమ్మ మొద్దు లు తెచ్చి పెద్ద బాడిషా తో చెక్కి తయారు చేసే వారు.దానికి కొలిమి లో ఇనుప కర్రు చేసి తగిలించి రైతు కు ఇస్తే..రైతు ఆ నాగలికి ఎడ్లు కట్టి పొలం దున్ని పంట పండించేవారు.ఆ పని చేసినందుకు రైతు వడ్రంగి కార్మికులకు సవత్సరానికి ఇంత మేర ( కూలి ) మాట్లాడుకుని ధాన్యం ఇచ్చేవారు.ఒక్కో వడ్రంగి కార్మికుడు 50 నుంచి 200 నాగళ్ళు తయారు చేయడం,పాతవి రిపేర్ చేయడం చేసేవారు .అప్పట్లో వడ్రంగి కార్మికులకు కావలిసినంత ధాన్యం సమకురేది. కర్ర తో ఎడ్ల బండి చేయడం కూడా వడ్రంగి కార్మికుల పనే..ఆ పని చాలా నైపుణ్యం తో కూడిన పని.ఏ టెక్నాలజీ లేకుండా 180 డిగ్రీల వృత్తాకారంలో బండి గిర్ర కొత్తది చేయడం అంటే మామూలు విషయం కాదు,చేసే పని పట్ల ఎంతో నిబద్ధత, ఏకాగ్రత ఉంటే నే అది సాధ్యం అయ్యేది.బండి గిర్రా తయారు చేశాక దానికి ఇనుప పట్టా ను పిడకల్లో ఎర్రగా కాల్చి ఎక్కిస్తారు.ఆ పని చేసేటప్పడు చాలా అప్రమత్తంగా ఉండాలి,లేకపోతే పట్టా గిర్ర కు ఎక్కదు,పడ్డ కస్థం అంతా వృధా అవుతుంది.ఇక ఇళ్ల నిర్మాణం విషయం కు వస్తె..పూర్వ కాలం లో ఇల్లు కర్ర తో నిర్మాణం చేసింది కూడా వడ్రంగి కార్మికులు,ఇంటికి అవసరం అయిన మొగరాలు,దూలాలు ,వాసాలు ,పెద్ద బాడిష తో చెక్కి ఇల్లు నిర్మించేవారు.కాలక్రమేణా పరిస్థితి మారి సిమెంట్ ఇళ్ల నిర్మాణం మొదలు అయ్యింది .అప్పటి నుండి దర్వాజలు,కిటికీలు,తలుపులు,కిటికీ రెక్కలు,మంచాలు,కుర్చీలు,తయారు చేసి ఇచ్చేవారు.ఆసామి ఏ డిజైన్ లో కావాలి అంటే ఆ డిజైన్ లో చేసి ఇవ్వడం ఈ వడ్రంగి కార్మికుల ప్రత్యేకత.గత 30 యేళ్ల క్రితం ఆధునిక యంత్రాలు అందుబాటు లోకి వచ్చి ఈ వృత్తి పని సులువు అయ్యింది. దుగొడ మిషన్,సంగడి మిషన్,చిన్న కటింగ్ మిషన్లు,పేపర్ మిషన్లు అందుబాటులోకి వచ్చాయి.ఈ వృత్తి పనిలో ఉలి బాడిశ,పాటస్ చాలా కీలకం అయినవి.గ్రామీణ ప్రాంతాల్లో నాగలి స్థానం లో ట్రాక్టర్ వచ్చి ఆ పని అంతరించి పోయే దశలో ఉంది.గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక, పట్టనాల్లో బ్రతకలేక,చావలేక బతుకు పోరాటం చేస్తున్నారు.బిల్డింగ్ నిర్మాణాల్లో కి కార్పొరేటు కంపెనీలు వచ్చి ఈ వృత్తి నీ దెబ్బ తీశాయి అని చెప్పవచ్చు.కర్ర తలుపుల స్థానం లో ఫ్లష్ డోర్స్,దర్వజల స్థానం లో డబ్లూ పీ వి సి దర్వాజలూ వచ్చాయి.ఆసామి ఫ్లష్ డోర్ కానీ ,డబ్లు పి వి సి డోర్ కానీ ఫిట్ చేస్తే ఓన్లీ ఫిట్టింగ్ ఛార్జ్ కొద్ది మొత్తమ్ లో మాత్రమే ఇస్తారు.దేశం మొత్తం ఎన్నో కోట్ల మంది ఈ రంగం పై వడ్రంగి వృత్తి పై ఆధార పడి జీవిస్తున్నారు. టాటా,ఎన్ సి ఎల్ లాంటి గొప్ప కంపెనీలు కూడా ఈ వృత్తి లోకి ప్రవేశించాయి.ఎన్ సి ఎల్ కంపెనీ టర్కీ విజ్ఞానం తో ఈ రంగం లోకి గత మూడు సంవత్సరాల క్రితం ప్రవేశించి హైదరాబాద్ శివారు ప్రాంతం చౌటుప్పల్ వద్ద కలప రహిత డోర్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది.ఇక వడ్రంగి వృత్తి లో భాగం అయిన ఇంటీరియర్ వృత్తి పై కూడా చాలా మంది ఆధార పడ్డారు.ప్లై వుడ్ ,దేకొలం తో చేసే ఈ పని ఖర్చు తో కూడుకున్నది.ఈ వృత్తి పై చిన్న,చిన్న మేస్త్రి ల నుండి బడా కంపెనీల వరకు ఆధార పడ్డవి.ఈ వృత్తి పని మిషన్ మీద చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి.చేతి వేళ్ళు కట్ అవ్వడం లాంటివి ,ఈ కార్మికులకు భద్రత లేదు.వీళ్ళను ఓట్ బ్యాంక్ గా వాడుకోవడం తప్ప ఏ రాజకీయ పార్టీ పట్టించుకోదు.పని దొరికినపుడు బ్రతకడం,పని లేనప్పుడు పస్తులు ఉండటం.మరీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయితే ఆత్మ హత్య చేసుకోవడం.. ఇదీ వీళ్ళ జీవితాలు.ప్రభుత్వం ఈ వడ్రంగి కార్మికుల కోసం సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు