మురుగు నీరు నియంత్రణకు చర్యలేవి?

శంషాబాద్ రాజీవ్ గృహకల్ప, (ఇందిరమ్మ కాలనీ లో) మురికి నీరు దుర్గంధంతో కాలనీవాసులకు ఇక్కట్లు
మొద్దు నిద్రలో మున్సిపల్ అధికారులు
పలమార్లు విన్నవించిన పరిష్కారం చూపని అధికారులు
దుర్గంధం నుండి విముక్తి కల్పించాలని మున్సిపల్ అధికారులకు వినతి
రంగారెడ్డి జిల్లా స్టాపర్ మార్చి 25 (నిజం న్యూస్)
శంషాబాద్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశుద్ధంపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, స్వచ్ఛ తెలంగాణ,స్వచ్ఛభారత్ గా తీర్చిదిద్దుతుంటే శంషాబాద్ మున్సిపాలిటీలోని ఓ ఓ ఆర్ ఆర్ రాజీవ్ గృహకల్పన, (ఇందిరమ్మ కాలనీ) లో భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మురుగు నీరుతో దుర్గంధంతో దోమలు, ఈగలు,బెడదతో రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. పలుమార్లు మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్న మోక్షం లభించలేదు. పట్టించుకోవాల్సిన అధికారులు మొద్దు నిద్రలో తూగుతున్నారని కాలనీవాసులు వెలగక్కుతున్నారు. రాజీవ్ గృహకల్ప సముదాయం ప్రాంతాలలో అధికారులు వివక్ష చూపకుండా పరిశుద్ధంపై దృష్టి సారించి , మురుగు సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ తీసుకోనీ చర్యలు చేపట్టాలని మున్సిపల్ ప్రజలు కోరారు.