Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రపంచాన్ని భయపెట్టిన కొవిడ్ -19

-అది 23,మార్చ్ 2020. గుర్తుందా భారతదేశంలో లాక్ డౌన్ ప్రారంభమైన రోజు.

ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ వార్త వినాలో అని భయాందోళనతో తప్పించిన క్షణాలు.

రంగారెడ్డి జిల్లా స్టాపర్ మార్చ్ 25 (నిజం న్యూస్)

ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ భవిష్యత్తులో ఏమీ జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి.
ఏ క్షణం ఏం జరుగుతుందో ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో భయంతో ప్రజలు అనేక సందేహాలు, అనుమానాలు, భయాందోళనలు ప్రతి మనిషిలో కలిగిన రోజు.
ఇక ప్రపంచం వినాశనమైతుందా? మానవజాతి ఉండదా? ప్రపంచంలో శవాల గుట్టలు పేర్కొని పోతాయా? ప్రాణంతో బతికే మనుషులు అగుపించారా? అనే అనుమానాలు ఆందోళనలు పంపవ్యాప్తంగా కలిగినాయి.
మేధావులు సైంటిస్టులు వైద్యులు ప్రపంచ విజ్ఞానులు భయాందోళనలో మునిగిపోయిన రోజు ఇక ప్రపంచ వినాశనం తప్పదు మానవజాతి అంతమే అని అందరూ అనుమానాలు వ్యక్తం చేసినారు. ఇలాంటి భయంకర పరిస్థితుల నుంచి భారతదేశాన్ని క్రమక్రమంగా కరోనా నుంచి విజయవంతంగా ప్రపంచంలోనే కరోనాన్ని జయించిన మొదటి దేశం గా భారతదేశం నిలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశము యొక్క ప్రజలకు పతనానికి భారతదేశం యొక్క ప్రజల పాలకుల పనితీరుకు నిదర్శనంగా ఈ యొక్క విజయం అనిపిస్తుంది. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చిన ధైర్యంగా ఎదుర్కొనే శక్తి పీఠులు కలిగిన దేశం భారతదేశం అని భారతదేశం ప్రపంచ దేశాలకు హాజరు అని ఎప్పుడైతే కరోనానో విజయవంతంగా ఎదుర్కొని భారతదేశాన్ని సురక్షితంగా కాపాడగలరు భారతదేశంలో ఉన్నారని ప్రపంచ దేశాలకు నేడు స్పష్టంగా అర్థమైంది.
ప్రపంచవ్యాప్తంగా 68 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతినిపోయింది ప్రజల జీవితం ప్రమాదంలో పడిపోయింది ఎక్కడ చూసినా శవాల గుట్టలు కుటుంబాలకు కుటుంబాలు కరోనా పడి ప్రాణాలు కోల్పోయి అనాధలైన పిల్లలు ఎక్కడ చూసినా విషాద సంఘటనలు కరోనా మహమ్మారితో ప్రపంచమే ఉలిక్కిపడి మానవ మనుగడ ఇక ఉండదా అనే సందేహం కలిగిన ఆందోళనలతో అల్లాడిపోయిన ప్రజలు.
కోవిడ్-19ని ఎదుర్కోవడానికి భారతదేశం అనుసరించిన చురుకైన మరియు బహుముఖ విధానాన్ని కోవిడ్ 19 నుంచి భారతదేశాన్ని విజయవంతంగా రక్షించి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని ప్రజలందరూ కూడా ధైర్యంగా జయించి మానవ మనుగడకు ఎలాంటి ప్రమాదం లేదని నిరూపించిన గొప్ప క్షణాలు. కేంద్ర ప్రభుత్వము తీసుకున్న చర్ల వల్ల టీకాలు అందుబాటులోకి రావడం ప్రజల ఆందోళనలను తొలగించి ప్రాణాలను కాపాడే దిశలో
కోవిడ్ వ్యాక్సిన్‌లు కనిపెట్టి భారత దేశమే ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శ దేశంగా కరోను జయించిన మొదటి దేశంగా గొప్ప పేరు సంపాదించడం భారతీయులకు ఎంతో గర్వకారణం.ప్రాణాలను కాపాడేందుకు మరియు స్థిరమైన జీవనోపాధికి అలాగే వ్యాధికి వ్యతిరేకంగా ఉత్తమ ప్రతిరక్షకాలుగా అవతరించాయి.కోవిడ్ వ్యాక్సిన్ ద్వారా ప్రాణ భయంతో భయపడుతున్న ఎందరికో అండగా,రక్షణగా నిలిచి ప్రాణాలు నిలిపిన కోవిడ్ వ్యాక్సిన్ మార్కెట్లలోకి రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.
అంతకుముందు ఎక్కడ చూసినా శవాల గుట్టలు ఎవరికి ఏమవుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని గందరగోల పరిస్థితి నుంచి నెమ్మదిగా భారతదేశాన్ని కోవిడ్ 19 నుంచి బయటపడే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన చర్య ఉపశమనాని కలిగించింది. కోవిడ్ బీభత్సం వల్ల అనాధలు అయిన పిల్లలు కుటుంబాలను ఆదుకునే దిశలో మానవ సంఘాలు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం. కువైట్ భయాందోళన నుంచి ప్రజలను గట్టెక్కించడానికి ముందుండి పనిచేసిన డాక్టర్స్, నర్సులు,వైద్య పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరు ప్రజలను కాపాడే దిశలో ఎంతో ధైర్యంగా మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి భారతదేశని కోవిడ్ నుండి రక్షించిన గొప్ప వ్యక్తులు.టీకాను స్థూల-ఆర్థిక సూచికగా పరిగణించాలి. భారతదేశంలో మొత్తము ప్రజలు తమ ఆరోగ్య అవసరాల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి ప్రాణాలను కాపాడుకోవడం జరిగింది. విలువైన ప్రాణాలను రక్షించి తమ కుటుంబాలను తమ పిల్లలను,కరోనా బారిన పడకుండా రక్షించుకోవడం కోసం ఎంతో డబ్బును ఖర్చు పెట్టడం జరిగింది.
ఆరోగ్య వ్యయం దాదాపు 73% పెరుగుదలను చూస్తుంది. కొవిడ్‌-19కు ముందు 2019-20లో అది రూ.2.73 లక్షల కోట్లు కాగా కొవిడ్ అనంతరం అది 2021-22లో అది రూ.4.72 లక్షల కోట్లకు పెరిగింది.
ఆరోగ్య రంగంపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ వ్యయం 2021-22లో జీడీపీలో 2.1% కాగా.. 2019-20లో అది 1.3%గా ఉంది.
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 ఆరోగ్యం మరియు ఇతర సామాజిక రంగాలలో ప్రభుత్వ కార్యక్రమాల ప్రోత్సాహక ఫలితాలను చూపుతుంది.
కోవిడ్ దాటికి ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు ఆర్థిక సంక్షేభంలో మునిగిపోయాయి ఒక్క భారతదేశం తప్ప అన్ని దేశాలు కూడా ఎంతో నష్టపోయినాయి భారతదేశం ప్రణాళిక బద్ధంగా ధైర్యంగా కోవిడ్-19 ఎదుర్కొని ఆర్థిక మూలాలను కాపాడుకుంటూ నిలబడినటువంటి గొప్ప దేశం భారతదేశం గత రెండేళ్ళలో భారతదేశంతో పాటు ఇతర ప్రపంచం మహమ్మారి దాడిని ఎదుర్కొన్నందున సమాజంలోని బలహీన వర్గాలకు భద్రతా వలయాన్ని అందించడంతోపాటు ఆరోగ్య పరిణామాలకు పొందికైన ప్రతిస్పందనను అందించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని ఆర్ధిక సర్వే తెలిపింది. కేంద్ర ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వేను  ఈరోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
ఆర్థిక రంగంలో భారత దేశము ఘన సవాలను ఎదుర్కొని క్రమక్రమైన ప్రపంచ దేశాలకు దీటుగా తన ఆర్థిక వ్యవస్థను నేడు పెంచుకొని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచింది ఉపాధి రంగాలలో ప్రజలకు కేతనందిస్తూ కోవిడ్ సమయంలో ప్రజలకు నిత్యవసరాలు వసూలతోపాటు ఉత్త బియ్యం పంపిణీ చేపట్టడం జరిగింది ఆరోగ్యపరమైన విషయాల పట్ల తీసుకునే విధంగా నిత్యం సూచనలు చేస్తూ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది.
ఆర్థిక సర్వే విధానానికి సంబంధించిన ‘చురుకైన ఫ్రేమ్‌వర్క్’ను కూడా హైలైట్ చేస్తుంది, అనిశ్చిత వాతావరణంలో, చురుకైన ఫ్రేమ్‌వర్క్ స్వల్ప ప్రత్యామ్నాయాలలో ఫలితాలను అంచనా వేయడం ద్వారా ప్రతిస్పందిస్తుంది. నిరంతరం క్రమంగా సర్దుబాటు చేస్తుంది ఎందుకంటే చురుకైన చర్య ప్రతిస్పందనను మెరుగుపరుస్తుంది. రేపు ఆర్థిక పరిస్థితిని ప్రజల మనుగడను దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాలలో క్రమక్రమేనా బెస్ట్ సారించి అభివృద్ధి పథంలో భారతదేశాన్ని తీసుకెళ్లడంలో భారత ప్రభుత్వం విజయం సాధించింది మరియు పరిణామానికి సహాయపడుతుంది, కానీ అది భవిష్యత్తు ఫలితాలను అంచనా వేయడానికి ప్రయత్నించదు గ్లోబల్ కొవిడ్ 19 మహమ్మారిపై కేంద్రం అనేక కార్యక్రమాలు తీసుకుని ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేస్తూ మీడియా ద్వారా పత్రికల ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తూ కరోనా భారంకి తమను తాను ఎలా కాపాడుకోవాలని నిత్యం ప్రచారం చేస్తూ పెద్దన్నపరిచింది కేంద్ర ప్రభుత్వం. భారతదేశంలో లాక్ డౌన్ నిర్వహించి మార్చి 23 నాటికి దాదాపుగా మూడు సంవత్సరాలు అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ కుంటుపడినప్పటికీ అన్ని రంగాలలో భారతదేశాన్ని పురోగమన దిశల్లోకి తీసుకెళ్లడానికి నిత్య ప్రయత్నాలు చేస్తూ క్రమక్రమంగా కోవిడ్ 19 నుండి ఉపమాప దిశలో టీకాను కనుక్కొని ప్రజలకు మనో ధైర్యాన్ని కలిగించి ప్రజల ప్రాణాలకు రక్షణ కలిగిస్తూ ప్రపంచంలోనే భారతదేశంగా గొప్ప పేరు సాధించింది. నేటికీ కోవిడ్ 19 వల్ల లాక్ డౌన్ ఎదుర్కొని విజయవంతంగా మూడు సంవత్సరాలు పూర్తయింది. క్రమక్రమంగా ప్రజల జీవన విధానంలో మార్పులు చేర్పులు చేసుకుని ప్రజల జీవితం అభివృద్ధి పథంలో సాగే విధంగా ప్రభుత్వము సహకారం అందివ్వడం ఎంతో గర్వించదగ్గ విషయం. భారతదేశం నేడు ఆపద రంగంలో నిమ్మ నెమ్మదిగా రాణిస్తుందంటే దానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన చర్యలే ముఖ్య కారణం. నేడు 2023 మార్చిని చూస్తున్న మనం ఈ జీవితము దేవుడు ప్రసాదించిన గొప్ప వరం కనుక మనమందరము ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకనైనా మనుషులందరూ నీతి, నిజాయితీగా ధర్మం కోసం,న్యాయ రక్షణ కోసం, పవిత్రమైన మనసుతో, సేవా దృక్పథంతో మనుషులమని మనల్ని మనం గుర్తించుకుంటూ ప్రేమవాసల్యంతో మానవ కోటికి మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆ దేవుడి యొక్క సన్నిధిలో నిత్యం తపిస్తూ మానవజాతిని మేలుకొలుపుదాం. ఎక్కడైనా మన తప్పులను సరి చేసుకొని ధర్మంగా భగవంతునికి అదే పదే మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జీవితాన్ని కొనసాగిద్దాం.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యంగా కలిసికట్టుగా కోవిడ్ 19ను ఎదుర్కోవడంలో ప్రముఖ పాత్రపై పోషించి ప్రజల ప్రాణాలను కాపాడడంలో ప్రభుత్వాలు విజయవంతమైనందుకు ప్రజలు ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జైహింద్ జై భారత్.