తునికి పండ్లలో పోషకాలు మెండు

చర్ల మార్చి 25 (నిజం న్యూస్) మన్యంలో అడవి బిడ్డలకు అటవీ ఫలాలే ఆర్థికంగా ఉపకరిస్తున్నాయి నిత్యం కష్టమే జీవనంగా అడవి ని ఆరాధ్యంగా నమ్ముకున్న ఆదివాసీలు అటవీ ఉత్పత్తులను సేకరించి తమ జీవన యానాన్ని సాగిస్తున్నారు ఈ క్రమంలో కాలానుగుణంగా అటవీలు దొరుకుతున్న పండ్లు ఆదివాసీలు సేకరించి మైదాన ప్రాంతంలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు ఈ క్రమంలో వేసవి ఆరంభంలో అడవిలో దొరికే తునికి పనులను సేకరించి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మండలంలో ఈ కారణ్యం మైన ఎర్రంపాడు చెన్నాపురం బట్టి గూడెం రామచంద్రపురం తిమ్మిరి గూడెం కొండేవాయి ఎర్ర బోరు కిష్టారంపాడు కమలాపురం గోరు కొండ . కుర్కట్ వాడు తదితర అటవీ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో గుత్తి కోయలు తునికి పండ్లను సేకరించి కుటుంబ పోషణకు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఎలాంటి మందులు లేకుండా పకృతి అనుగుణంగా పండి తునికి పనులను ప్రజలు వారి దగ్గర నుండి కొనుగోలు చేస్తున్నారు ఆరోగ్యానికి ఈ తునికి పండ్లు ఎంతో మేలు చేస్తాయని వీటిలో మంచి పోషక లు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ఎంతో రుచిగా ఉండే పండ్లను కొనుగోలు చేసేందుకు స్థానిక ప్రజలు పోటీ పడుతున్నారు దీంతో తునికి పండ్ల కు డిమాండ్ పెరిగింది ఈ క్రమంలో భద్రాచలం పాలవంచ కొత్తగూడెం పట్టణాలకు సైతం తీసుకువెళ్లి ఆదివాసీలు ఈ పండ్లను విక్రయిస్తున్నారు ఈ పండ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు