తిరుమలగిరి తుంగతుర్తి మండలాల్లో వడగండ్ల బీభత్సం

ఒక్కొక్క రాయి 500 గ్రాములు….
భారీగా ఇంటి పైకప్పులు, బైకులు, పంట, తోటల నష్టం.
లబోదిబోమంటున్న రైతాంగం.. నష్ట పరిహారం అందించాలని రైతుల వేడు కోలు.
సూర్యాపేట ప్రతినిధి మార్చి 19 నిజం న్యూస్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి తుంగతుర్తి మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి వీదురు గాళ్లు ఒకవైపు మరొకవైపు వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. తిరుమలగిరిలో మెయిన్ రోడ్డుపై పలు చెట్లు కూలిపోవడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది. తుంగతుర్తి మండలం లోని గొట్టిపర్తి రావుల పెళ్లి తదితర గ్రామాల్లో శనివారం రాత్రి ఒక్కసారిగా వడ గండ్ల వాన కురియడంతో ఒక్కొక్క రాయి సుమారు 500 గ్రాములు ఉన్నట్లు స్థానికులు తెలిపారు కొంతమంది ఇంటి ముందు కార్లు బైకులు పెట్టుకోగా అద్దాలు పగడం జరిగాయి. కొంతమంది ఇంటి పైకప్పులు పగిలిపోయాయి. మిర్చి. మామిడి నిమ్మ జామ తోటలు సైతం నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జరిగిన సంఘటనపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.