పత్రికా..స్వేచ్చ ని కాపాడండి

జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో.. ర్యాలీ
చర్ల మార్చి 18 (నిజం న్యూస్) వి6 వెలుగు దినపత్రిక v6 వెలుగు న్యూస్ ఛానల్ లను బ్యాన్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునివ్వడాన్ని నిరసిస్తూ శనివారం అంబేద్కర్ సెంటర్ నుండి జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టు ల ఐక్యత వర్ధిల్లాలని పత్రిక స్వేచ్ఛని కాపాడాలని.వి6 వెలుగు పత్రికలపై ప్రభుత్వ నిషేధాన్ని ఎత్తివేయాలని. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలతో రెవిన్యూ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తాహసిల్దార్ బి భరణి బాబుకు వివిధ సమస్యలతో కూడిన వింత పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు నా వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు దొడ్డ ప్రభుదాసు కొంగూరి రమణారావు. చిట్టి మల్ల శేషగిరి.పరచూరి రవీంద్రబాబు మోతుకురి చిన వెంకటేశ్వర్లు. కోడి రెక్కల వెంకటేశ్వర్లు. బొబ్బిలి ప