విలువ లేని పేదోడి ప్రాణం

-సుజాతనగర్ రైస్ మిల్లు జరిగిన భారీ ప్రమాదాన్ని దాచిపెట్టి సెటిల్మెంట్ చేసిన ఘనులు….
-మృతుని కుటుంబ సభ్యులతో బేరసారాలు చేసిన రైస్ మిల్ మరియు ఇటుక బట్టి యాజమానీ.
-పోలీస్ కేసు కాకుండా బాధితుల కుటుంబాన్ని బెదిరించిన వైనం
-లేబర్ ఆక్ట్ కింద వచ్చే నష్టపరిహారం 6.500లక్షల బదులు లక్ష రూపాయలతో సెటిల్మెంట్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్చి 18 (నిజం న్యూస్) భద్రాది కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామం నందు గల సాయి దుర్గ పారా బాయ్ అండ్ రామ్ రైస్ ఇండస్ట్రీలో కొన్ని రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యి మంచం పై నుండి లేవలేని స్థితిలో ఉన్నాడు. వివరాల్లోకెళ్తే రైస్ మిల్ లో ఉండే వేడి యాస్ నీ చల్లార్చిన తర్వాత మిల్లు యాజమాన్యం వాటిని ఇటుక బట్టి యజమానులకు విక్రయిస్తుంది. ఇదే క్రమంలో గత కొన్ని రోజుల కింద పాత కొత్తగూడెం చెందిన ఒక ఇటుక బట్టి వ్యాపారి యాష్ కోసం తన దగ్గర కూలీలుగా పని చేసే కొందరిని తన సొంత ట్రాక్టర్లు లో లోడ్ చేసి తీసుకురావడానికి పంపించారు. చల్లారిన యాష్ ని లోడ్ చేసే క్రమంలో మిల్లు యాజమాన్యం ఎటువంటి సమాచారం లేకుండా పైనుండి లోడైయున్న అత్యంత వేడిగా ఉండే యాస్ నీ వదలడంతో అందులో కూలీలుగా పనిచేస్తున్న కోడి నరసింహ,రాజు అనే వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు.ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని మీల్లు యాజమాన్యం కానీ బట్టి యజమాని కానీ కనీసం పోలీస్ వారికి ఏటువంటి సమాచార ఇవ్వకుండా,అత్యవసర పరిస్థితిలో ఉపయోగించే 108 వాహనo కీ కూడా ఫోన్ చేయకుండా నిర్లక్ష్యంగా తీవ్ర గాయాలయి కాళ్లు చేతులు చాలావరకు కాలిపోయిన వారిని నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనంపై వారిని మొదటగా సుజాత నగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.అక్కడ చికిత్సకు నిరాకరించడంతో,కొత్తగూడెంలోని విద్యానగర్ కాలనీలో గల యశోద హాస్పిటల్ కి తరలించారు.అక్కడ చికిత్స నిమిత్తం కోడం నరసింహ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని హాస్పిటల్ తరలించారు.కొన్ని రోజులపాటు చికిత్స తీసుకున్న నరసింహ మరణించాడు.రాజు మాత్రం చికిత్స అనంతరం యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.దీంతో భయభ్రాంతులకు గురైన మిల్లు యాజమాన్యం మరియు భట్టి యాజమాని తమపై కేసులు అవుతుందని భయంతో మృతదేహం హైదరాబాద్ నుంచి ముద్దుకురు వచ్చే లోపల మృతుని కుటుంబ సభ్యులను మభ్యపెట్టి స్థానికంగా ఉన్న ఒక ప్రజా ప్రతినిధి సహాయంతో ఒక లక్ష రూపాయలకు సెటిల్మెంట్ చేసి మృతదేహం ముద్దుకురు వచ్చిన వెంటనే దహన కార్యక్రమాలు చేసేసారు. ———-
6.50 లక్షల బదులు ఒక లక్ష రూపాయలతో సెటిల్మెంట్ ———. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం మృతునికి తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం బోర్డు ఇచ్చే గుర్తింపు కార్డు ఉంది.వాటి నియమ నిబంధన ప్రకారం కార్మికుడు ఏమైనా ప్రమాదానికి గురై చనిపోతే దానికి సంబంధించిన నిబంధనల ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదు కేసు అయితే అనంతరం బాధితులకి ప్రభుత్వ నుండి ఆరు లక్షల 50 వేల రూపాయల నష్టపరిహారం అందుతుంది.కానీ బట్టి యజమాని మరియు మిల్లు యాజమాన్యం తమపై ఎటువంటి కేసులు భయపడి మృతిని కుటుంబాన్ని భయపెట్టి మభ్యపెట్టి కేవలం ఒక్క లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చి ఆ మరణం వెనుక ఉన్న నిజాన్ని దాచి పెట్టి సమాధి చేశారు.దీనిపై మిల్లు యాజమాన్యాన్ని వివరణ కోరగా మా మిల్లులో అటువంటి ప్రమాదం ఏమి జరగలేదని చెప్పడం పలు అనుమానానికి దారి తీస్తోంది. ఒకవేళ చనిపోయిన 12కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన మిల్లు ఒకరి చావుతో పోలీస్ కేసు అయ్యు మూసివేయాలా అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పినట్టు వినికిడి. దీనిపై బట్టి యజమాని వివరణ కోరగా ప్రమాదం జరిగింది వాస్తవమేనని కానీ ఎవరికి అందాల్సిన ముడుపులు వారికి అందాయని దీనిని ఇంతటితో వదిలేస్తే బాగుంటుందని సమాధానం చెప్పారు.రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో జన్మించి బట్టి యజమాని దగ్గర బానిసలుగా బ్రతుకుతూ బట్టి మరియు మిల్లు యాజమాన్యం వారి నిర్లక్ష్యానికి బలయ్యి ప్రభుత్వం నుంచి వచ్చే నష్ట పరిహారం కూడా రాకుండా నిర్భక్షంగా వ్యవహరించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.