నాలుగు లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేత

ముధోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 17 (నిజం న్యూస్)
భైంసా డివిజన్ పరిధిలోని దేగాం గ్రామములో ఎమ్మెల్యే నివాసంలో కుబీర్ మండలంలోని సోనారి గ్రామ మున్నూరు కాపు సంఘ భవనం నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు మంజూరు అయిన ప్రొసీడింగ్ కాపీని మున్నూరుకాపు సంఘ సభ్యులకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందజేసారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుమల నారాయణ ఎంపీటీసీ లక్ష్మిమల్లారెడ్డి గ్రామ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు ఇర్ల భోజన్న,గ్రామ మున్నూరుకాపు సభ్యులు పాల్గొన్నారు.