విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన మంత్రి

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో మార్చ్ 17 (నిజం న్యూస్)
నిర్మల్ నియోజకవర్గం దిలావర్ పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో రూ 15 లక్షల వ్యయం తో పున నిర్మించిన శ్రీ మల్లన్న స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రికి వేద పండితులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. అనంతరం మల్లన్న స్వామి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక తెలంగాణ లో దేవాలయాలకు మహర్దశ వచ్చిందన్నారు. తాను దేవాదాయ మంత్రిగా గా రెండో సారి వుండటం వల్లనే నిర్మల్ లో ఆలయాలను అభివృద్ధి చేసుకోగలుగుతున్నామన్నారు. గుండం పల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి 36 లక్షలు, రాజ గోపురానికి45 లక్ష లు,హనుమాన్ ఆలయాలకు 30 లక్షలు, భీమన్న ఆలయానికి 10 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. మల్లన్న ఆలయానికి 5 లక్షలు కాంపౌండ్ వాల్ కు మంజూరు చేస్తానని తెలిపారు.