Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం – జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

మహారాష్ట్ర సరిహద్దుతో ఉన్న పోలీస్ స్టేషన్ లలో ప్రతిక్షణం అప్రమత్తత గా ఉండాలి.

సీసీటీవీ లు, డయల్ – 100 యొక్క ప్రాధాన్యత ను ప్రజలలో అవగాహన కల్పించాలి.

నెలవారి నేరసమీక్ష సమావేశాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ.

అదిలాబాద్ జిల్లా ప్రతినిధి మార్చ్17 (నిజంన్యూస్) శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని సమావేశ మందిరం నందు జిల్లా పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి నెల వారి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెలలో జిల్లా వ్యాప్తంగా జరిగిన నేరాలపై సమీక్ష, నమోదైన కేసుల పురోగతి, వర్టికల్స్, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు, ఎన్ బి డబ్ల్యూ, సైబర్ క్రైమ్, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మొదటి నుండి జిల్లా పోలీసులు జిల్లా లో జరిగిన ప్రమాదాలపై సమీక్షలు జరిపి గణనీయంగా ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తూ ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నారని తెలియజేశారు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో హైవేలపై, పట్టణాల్లో గ్రామాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ముఖ్యంగా ద్విచక్ర వాహనాల రోడ్డు ప్రమాదాలను తగ్గించారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది కావున సరిహద్దు పోలీస్స్టేషన్లో పకడ్బందీగా గస్తీ నిర్వహిస్తూ, రాత్రివేళల మరింత అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామీణ సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుంటూ సీసీటీవీ కెమెరాలు, డైల్ -100 యొక్క ప్రాముఖ్యత, ప్రస్తుతం సైబర్ నేరస్తులు అవలంబిస్తున్న నూతన పద్ధతులను ప్రజలకు సవివరంగా వివరించాలని తెలిపారు. కేసులు నమోదు చేయడమే కాకుండా వాటిని త్వరితగతిన పరిష్కరించి నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానాల యందు ప్రవేశపెట్టాలని సూచించారు. ముందస్తు సమాచారంతో నేరల నివారణ మరియు అరికట్టవచ్చని దానిపై ప్రాధాన్యతను ఉంచాలని తెలిపారు. ఈ సమావేశం నందు అడిషనల్ ఎస్పీలు పరిపాలన ఎస్ శ్రీనివాసరావు, ఓఎస్డి బి రాములు నాయక్, డిటిసి సి సమయ్ జాన్ రావు, డీఎస్పీలు వి ఉమేందర్, పోతారం శ్రీనివాస్, సిఐలు,ఎస్ఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, స్పెషల్ బ్రాంచ్, డిసిఆర్బి, ఐటీ కోడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.