ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమ అరెస్ట్ ను కండిస్తున్నాo

– భీమ్ ఆర్మీ జిల్లా అద్యక్షుడు దొబ్బల ప్రవీణ్ కుమార్:
రాజన్న సిరిసిల్ల జిల్లా, 17(నిజo న్యూస్);
గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన డా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీ అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంబేద్కర్ విగ్రహం ముందు భీమ్ ఆర్మీ, బిఎస్పి నేతలు రాస్తారొకో చేశారు. ఈ సందర్భంగా భీం ఆర్మీ జిల్లా అద్యక్షుడు దొబ్బల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుధ్యోగులకు నిరాశే మిగిలిందని, 8 సం తరువాత 80 వేల ఉద్యోగాలు అంటూ గొప్పగా చాటింపు చేసుకున్న ప్రభుత్వం, అవి సామాన్య నిరుధ్యుగులకి దక్కకుండా పేపర్స్ లీకు చేస్తున్నదని, రాష్ట్రములో 30 లక్షల నిరుధ్యోగులు ఇంటికి దూరం ఉంటూ, లక్షలో అప్పులు చేసి తిండి, తిప్పలు మాని ఉధ్యోగాలు వస్తాయని ఆశతో కోచింగ్ లు తీసుకుంటే, తీరా ఇవ్వాళ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూ పేపర్స్ లీక్ లు చేస్తుందని, ఇప్పటికైనా వెంటనే టిఎస్పిఎస్ చేర్మెన్ కమిటినీ, నిర్వహించిన టిఎస్పిఎస్సి పేపర్స్ వెంటేనే రద్దు చేసి, మరల నిర్వహించాలని, అలాగే దీనికి కారణం అయినా వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుధ్యోగులని ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమo చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భీమ ఆర్మీ నాయకులు మధు, నవీన్, బీఎస్పీ అధ్యక్షుడు స్వామి గౌడ్, రాష్ట్ర నాయకులు అంకని భాను, మధుకర్, ప్రేమ్, రాజు తదితరులు పాల్గొన్నారు.