ఎల్లుండి పెండ్లి …. నేడు డబ్బులు మాయం!

ఇంటికి పెయింట్ వేస్తున్న వ్యక్తి దొంగతనం చేశాడని ఫిర్యాదు. విచారణ జరుపుకున్న పోలీసులు.
తుంగతుర్తి మార్చి 16 నిజం న్యూస్
తుంగతుర్తి మండల కేంద్రం చెందిన ఎంత బోయిన సోమలింగయ్య యాదవ్ ఇంటిలో ఈనెల 18న తన చిన్న కుమారుడు సంతోష్ వివాహం జరగబోతున్న నేపథ్యంలో అతడి స్వగృహానికి రంగులు వేయడానికి ఓ వ్యక్తి పనుల్లోకి వచ్చి, మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో 50,000 వేల నగదు మాయం చేసిన సంఘటన గురువారం మిట్ట మధ్యాహ్నం జరిగింది. పెండ్లి ఇంట్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది .పోలీస్ స్టేషన్ కు కూతబెట్టుకురులో ఉన్న ఆ ఇంటిలో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం చోటు చేసుకుంది. దీంతో పెండ్లికి చెందిన మెంతబోయిన సోమలింగయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తక్షణమే పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి అతని గాలింపు చర్యలు చేపట్టి, సంబంధిత వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి, పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనా గ్రామానికి చెందిన వ్యక్తినే ఈ దారుణానికి పాల్పడడంతో ఎవరిని నమ్మాలో ,ఎవరిని నమ్మొద్దు అని బాదిత కుటుంబ సభ్యులు బోరున విలపించారు.