ప్రేమ పేరుతో మోసం..ఆత్మహత్యాయత్నం

పటాన్ చెరువు మార్చి 16 (నిజం న్యూస్) సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంకు చెందిన వినూత్నేశ్వరీ ని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆరేళ్లుగా చనువుగా ఉంటూ, వేరే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ కు సిద్దమైన బిఆర్ఎస్ పార్టీ మండల ప్రజా పరిషత్ ప్రతినిధి ఈర్ల దేవానంద్ కుమారుడు ఈర్ల ప్రశాంత్ . గత ఆరేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగించి పెండ్లి చేసుకుంటానని చెప్పి. రేపు వేరే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నాడని విషయం తెలిసిన యువతి విష పదార్థం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మెరుగైన వైద్యం కోసం పటాన్ చెరువు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు