తాటి చెట్టు పై నుండి జారి గీత కార్మికునికి గాయాలు

మాడ్గుల మార్చి 16( నిజం న్యూస్): మండల పరిధిలోని సుద్దపల్లి గ్రామానికి చెందిన పందుల లక్ష్మయ్య ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి జారి కింద పడడంతో బలమైన గాయాలు అయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్, కల్వకుర్తి అభివృద్ధి సాధన కమిటీ చైర్మన్ యాచారం వెంకటేశ్వర గౌడ్ విచారం వ్యక్తం చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. గాయాల పాలైన గీత కార్మికుని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.