Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పిడుగుపాటుకు 20 మేకలు మృతి

 

చర్ల మార్చి ( 16 నిజం న్యూస్) మండలంలోని దేవరపల్లి పంచాయితీ మామిడిగూడెం గ్రామంలో గురువారం నాలుగు గంటల సమయంలో అకాల వానకు గ్రామానికి చెందిన కారం వీరస్వామి కారం లక్ష్మి కోండ్రు నాగయ్య శ్యామల లక్ష్మీల మేకలు పిడుగు పడి 20 మేకలు మృతి చెందాయి మేకల యజమానులు తెలిపిన వివరాల ప్రకారం అడవికి మేతకు వెళ్లి ఇంటికి వెనుతిరిగి వస్తుండగా ఊరి శివారులో అకాల గాలి వర్షంతో వచ్చిన వానకు పిడుగు పడి మేకలుమృతి చెందాయని తృతిలో ప్రమాదం తప్పిందని మేము కూడా పిడుగుపాటుకు బలి అయ్యేవా వాళ్లమని యజమానులు తెలిపారు. సమాచారాన్ని తెలుసుకున్న సర్పంచ్ కారం సమ్మయ్య ఉటాఉటిన వెళ్లి వివరాలని అడిగి తెలుసుకున్నారు వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు అక్కడకు రైతులు పెనుమత్స సీతారామరాజు మంతెన శ్రీనివాసరాజు గ్రామస్తులు సబ్కా గణపతి ఎల్లం బుచ్చయ్య తెల్లం లక్ష్మీనారాయణ కారం సీతారాములు తెల్లం లక్ష్మీనర్సు. అక్కడికి చేరుకున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు