మూడవ రోజు సాగిన సమ్మక్క సారలమ్మ జాతర

చర్ల మార్చి 16( నిజం న్యూస్) మండలంలోని ఆర్ కొత్తగూడెం పంచాయతీ దానవైపేట గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర మూడవ రోజుకు చేరుకొంది జాతర కు అతిథులుగా కొరస వెంకటేశ్వర్లు ( కేవి సివిల్ ఇంజనీర్) ఆదివాసి టీసర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు జయ బాబు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవార్లను దర్శించుకున్నారు.
జాతర మహోత్సవం కన్నుల విందుగా సాగింది సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి వారి మొక్కుబడులను తీర్చుకుంటున్నారు గురువారం సాయంత్రం ఏడు గంటలకు అగ్నిగుండం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రాష్ట్ర కార్యదర్శి అపక శ్రీనివాస్. ఆర్గనైజింగ్ కార్యదర్శి శవలం వీరస్వామి. జిల్లా కార్యదర్శి కొరస చిట్టిబాబు. మండల అధ్యక్షులు శ్యామల రామారావు ప్రధాన కార్యదర్శి తోకల లక్ష్మీపతి విద్యార్థి సంక్షేమ పరిషత్ ప్రధాన కార్యదర్శి నూప నాగేశ్వరరావు. ఆదివాసీ సంక్షేమ జిల్లా అధ్యక్షులు తెల్లం నరసింహారావు ఆలయ కమిటీ కారం సుధాకర్ నూపా రమేష్ సోయం శ్రీను మడకం జోగయ్య. సాయం నారాయణ .సాయం కామరాజు. సోమరాజు తదితరులు పాల్గొన్నారు