ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో నిస్తేజంలో కాంగ్రెస్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో నిస్తేజంలో కాంగ్రెస్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో ఎన్నికల వేడి ఊపందుకుంది. అన్ని ప్రధాన పార్టీల నుంచి ఆయా నియోజకవర్గాలను కేంద్రంగా చేసుకొని నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలుపెట్టారు. ప్రతీ గ్రామంలో ఓటర్లను కలుస్తూ తమ పార్టీనే గెలిపించాలని ప్రచారం అప్పుడే మొదలు పెట్టారు. శ్ట్రీఖ్ కార్నర్ మీటింగులు, బైక్ రాలూలు, రచ్చబండ కార్యక్రమాలు వంటి వాటిని ప్రణాళికాబద్ధంగా జరుపుతుండదంతో జిల్లాలో ఫుల్ జోష్ పెరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
కొన్ని నియోజకవర్గాల్లో కీలక నేతల ఆనవాళ్లే కనిపించడం లేదు. ఉన్న నాయకులు తామే నిలబడతామంటూ ప్రకటనలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం లేదు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట, కల్వకుర్తి నియోజకవర్గం వర్గాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. నియోజకవర్గంలో నాయకత్వం వహించి ఆ పార్టీని ముందుకు నడిపించాల్సిన నేతలు నియోజకవర్గంలో పర్యటించేందుకుముందుకు రాకపోవడంతో కార్యక్రమాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి.
ఒకపక్క భారత్ జోడో సందర్భంగా నాయకులందరూ ఫుల్ జోష్ తో పని చేయాలని రాహుల్ గాంధీ పిలుపు నివ్వగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ నాయకులు నిస్తేజంగా వుంటున్నారు. ప్రత్యర్ధులకు దీటైన రితిలో జవాబిచ్చేందుకు, పోటా పోటీ గా సభలు, రాలీలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించేందుకు కీలక నేతలు ముందుకు రాకపోతుండడంతో కార్యకర్యలు, కాడర్ అజ్ఞాతం లోకి వెళ్ళిపోతున్నారు.
నియోజకవర్గ బరువు బాధ్యతలు మోయవలసిన నేతలు ఒకరు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుండగా.. మరొకరు విస్తృత పర్యటిస్తాం మన సత్తా ఏంటో చూపిస్తాం అని ప్రకటనలకు మాత్రమే పరిమితమై అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తుండగా మరోవైపు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రజా వ్యతిరేక విధానాలపై అధికార పార్టీ నేతలను నిలదీయక, ప్రజా సమస్యల పోరాటాలు చేయలేక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లడం లేదు.
ఈ కారణంగా పార్టీ అధిష్టానం చొరవ చూపి కార్యక్రమాల నిర్వహించగల సత్తా ఉన్న నాయకులకు బాధ్యత అప్పగించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ రెండు నియోజకవర్గాల ఎఫెక్ట్ వాటి పక్క నియోజకవర్గాలపై కూడా పడి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొక తప్పదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సిహెచ్.ప్రతాప్