ఊరు వల్లకాడు…..ఉలుకు పలుకు లేని నేతలు

-సమస్యను పట్టించుకోని తాజా మాజీ సర్పంచులు.
– ఊరు వల్లకాడైన చోద్యం చూస్తున్న అధికారులు నేతలు.
– భారీగా పోలీసుల బందోబస్త్ మధ్య అంత్యక్రియలు.
– సమస్య కొలిక్కిరాక మనస్థాపంతో ఆత్మహత్యకు సిద్దపడ్డ వార్డ్ మెంబర్ అంజన్న.
– ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు దళిత వర్గం ధర్న.
చేవెళ్ళమార్చి 11(నిజం న్యూస్ ) దామరగిద్ద గ్రామంలో దశాబ్దాలుగా నిగురు కప్పిన నిప్పులా ఉన్న నిశ్శబ్ద స్మశానం ఒక్కసారిగా బగ్గున మండింది. గత కొంతకాలంగా ఊరి స్మశానం చుట్టు అలుముకున్న పరిస్థితులు జరుగుతున్న సంఘటనలు పల్లె ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. తగ్గేది లేదంటున్న ఇరు వర్గాలు ప్రజలు ఎంజరుగుతుందో అర్ధం కాని యువత. ఏ క్షణంలో ఏం జరుగుతుందో నన్న భయంతో ఊరి జనం.
గ్రామ సమస్యలు ఊరి పెద్దల సమక్షంలో సద్దుమనిగిన సందర్భాలు కోకొల్లలుగ ఉన్నాయి. కాని ఈ గ్రామంలో స్మశానం సమస్య పెద్దదైనది. పాత స్మశానం ఆనుకొని ఎస్ సి కాలనీ వెలిసింది. స్మశానం పక్కన దళితులకు ఇంటి స్థలాలు ఇచ్చిన నాయకులు స్మశానం సమస్యను తెంచలేక పోతురు. స్మశానం వరకు దళితుల ఇల్లు విస్తరించాయి. ప్రభుత్వం మరో చోట స్మశానంకు స్థలం కేటాయించి సకల సౌకర్యాలు కల్పించిన కొత్త స్మశానంలో అంత్యక్రియలు చేయం పాత స్మశానంలోనే చేస్తామని బిసి వర్గం వాదన కాగా! పాత స్మశానంతో ఇళ్ళ మధ్యన ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఎస్ సి వర్గం వాదన. ఇరు వర్గాలు అధికారుల నాయకుల దృష్టికి సమస్యను విన్నవించారు. రోజులు గడిచిన అధికారులు నాయకుల నుంచి ఎలాంటి స్పందన లేక సమస్య ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. పోలీసులు లాటిఛార్జ్ చేసి రెండు వర్గాలలో 20, 20 మంది పై కేసు నమోదు చేశారు. ఊరి సర్పంచ్ దవాఖానలో చేరిండు. సమస్య నెలకొన్న తరుణంలో మాజీ సర్పంచ్ సింగాపూర్ విదేశాలకు పోయిండు. ఇంతలో బిసి సామజిక వర్గానికి చెందిన మహిళా చనిపోయింది. గ్రామంలో భద్రత కట్టడి చేసి పోలీసులు భారీ బందోబస్త్ మధ్య పాత స్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కొలిక్కిరాని స్మశానం సమస్య పట్ల మనస్థాపం చెందిన వార్డ్ మెంబెర్ అంజన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపైన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. ఆగ్రహానికి గురైన దళిత వర్గం క్యాంపు కార్యాలయం ఆవరణలో దర్నాకు దిగి ఎమ్మెల్యే డౌన్ డౌన్… ఎమ్మార్వో డౌన్ డౌన్… ఆర్డిఓ డౌన్ డౌన్… ఎంపీడీవో డౌన్ డౌన్… అంటూ నినాదాలు చేశారు. సున్నిత అంశం ఇంత జరుగుతున్న తాజా మాజీ సర్పంచ్ లు ఇరువర్గాలతో సామారషంగా పరిష్కరించాల్సింది అంశం. ఎవరికి వారే ఎమునాతిరే అన్నట్లు… ఊరి పెద్దలు కుల సంఘాల నాయకులు తటస్థంగా ఉండిపోయారు. మాజీ విదేశాలకు పోతె తాజా సర్పంచ్ దవాఖానకు పోయి ఊరును వల్లకాడు చేశారు. ఇంతకాలం సోదర భావంతో ఉన్న ఊరు జనంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. అనాది నుండి విభజించి పాలించడం అనేది నాయకుల లక్ష్యం. స్వార్థం ఎవరిదైనా సమస్య ఊరును చుట్టింది. ఇంత జరుగుతున్న నాయకులు అధికారులు పెడచెవిన పెట్టడం వెనుక ఆంతర్యం ఏంది అన్న విషయాన్ని గుర్తెరుగాలి.ఇంతకాలం లేని స్మశానం సమస్య ఇప్పుడు తెరపైకి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మీరు జనం గమనించాలి. చర్చలతో సమస్య సద్దుమనుగు. ఎమ్మెల్యే కార్యాలయంలో ధర్నా అనంతరం ఎమ్మెల్యే కాలే యాదయ్య తన కార్యాలయానికి చేరుకొని సామాజిక వర్గం వాళ్లతో మాట్లాడి పూర్తిగా తెలుసుకొని అధికారులకు ఫోన్ చేసి గ్రామ ప్రజలందరూ వైకుంఠధామం లోని అంత్యక్రియలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.