బండి సంజయ్‌ను అరెస్టు చేయాలి

మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో బండిపై ఫిర్యాదు చేస్తున్న నవీన్ రావు,
అతిథిగృహం ఎదుట ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు
– మహిళలపై అసభ్య పదజాలం సిగ్గుచేటు
– జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావు
మరిపెడ, మార్చి 11 నిజం న్యూస్
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మహిళలను గౌరవించే సనతన భారతదేశంలో మహిళల పట్ల అస్యభ్యంగా వాఖ్యలు చేయడం సిగ్గుచేటని, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని, ఓ మహిళా ప్రజా ప్రతినిధి, రాష్ట జాగృతి అధ్యక్షురాలి పట్ల అరెస్టు చేయక ముద్దు పెట్టుంకుంటారా అని వాఖ్యనించటం సరికాదని వెంటనే బండి సంజయ్‌ను అరెస్టు చేయాలని మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్‌రావు, జడ్పీటీసీ తేజావత్ శారదా రవీందర్, ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు డిమాండ్ చేశారు. బండి సంజయ్ వాఖ్యలకు నిరసనగా శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆర్అండ్‌బీ అతిథి గృహం ఎదుట రాస్తారోకో నిర్వహించి ర్యాలీగా పోలీస్‌స్టేషన్ వెళ్లి బండి సంజయ్‌పై ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో మహిళలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని, అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తూ వారి ఉన్నతికి తొడ్పడుతుందన్నారు. అన్నింటా ముందుండాలని మహిళలకు రిజర్వేషన్లు పెంచాలని, 20ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కోరుతూ మహిళల అభ్యున్నతికి పోరాడుతున్న కల్వకుంట్ల కవితపై అసభ్య వాఖ్యలు చేయటం సిగ్గుచేటన్నారు. దేశంలో బిజేపీ అరాచకపాలన కొనసాగుతుందని, ఎదిరించిన వారిని అణచివేసే విధంగా పాలన చేయటం నియంతృత్వమన్నారు. ఎన్నో ఏళ్లుగా అణచివేతకు గురైన మహిళలు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారని, బండిసంజయ్, కేంద్ర బిజేపీ ప్రభుత్వంలో మళ్లి మహిళలు అణచివేతకు గురవుతున్నారన్నారు. చిత్తశుద్ది ఉంటే తెలంగాణతో సమానంగా దేశ వ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని, అది వదిలేసి మహిళల గౌరవం, హక్కుల కోసం పోరాడుతున్న కవితపై ఇష్టానుసారం మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కానీ అవగాహన లేని బీజేపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు.
బిజెపి అధినాయకత్వం కుట్ర పూరితంగా కవితపై కేసు పెట్టినా పారిపోకుండా ధైర్యంగా విచారణ ఎదుర్కొంటున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన బిజెపి బ్రోకర్లు, వారి వెనకాల ఉన్న బీఎల్ సంతోష్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కానీ కవిత మాత్రం ఏ తప్పు చేయకున్నా.. ధీరవనితలు రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మీబాయిలా ధైర్యసాహసాలతో పోరాడుతున్నారు. వెంటనే యావత్ మహిళలకు, కవితకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారన్నారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ చాపల యాదగిరి రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పల నాగేశ్వర రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుగులోత్ వెంకన్న, మైనార్టీ సెల్ అధ్యక్షుడు లతీఫ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు అజ్మీర రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జాటోత్ బాలాజీ, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దిగజర్ల శ్రీను, కోఆప్షన్ మక్సూద్, సర్పంచ్ గుగులోత్ భరత్, బీఆర్ఎస్ నాయకులు పానుగోతు వెంకన్న, వీసారపు శ్రీపాల్ రెడ్డి, తల్లాడ నాగేశ్వరరావు, మధు, వస్రాం, కృష్ణ, ఇద్దయ్య, ఎల్ వెంకన్న, దర్గయ్య, వీరన్న, ఉదయ్, తిరుపతి, యాకుబ్‌పాషా, రేఖ వెంకటేశ్వర్లు, భద్రయ్య, వార్డు కౌన్సిలర్లు కిషన్, ఎడెళ్లి పరశురాములు, బయ్య భిక్షం, హతిరాం, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.