పెద్ద పేపర్ల పేరుతో వసూళ్ళ దందాలు..!

మండలం లో జరుగుతున్న భూ వ్యవహారంలో వారిదే కీలక పాత్ర!!
విధులకు ఎగనామం పెడుతున్న ఉద్యోగుల వద్ద లక్షల్లో వసూళ్ళు!!
మాడ్గుల మార్చి 11(నిజం న్యూస్ ):
మాడ్గుల మండలంలో అవినీతికి పాల్పడుతున్న ఆ ప్రముఖ పత్రికల విలేకరులపై చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే గత కొన్ని సంవత్సరాలనుండి మండలం లోని ఎలాంటి అక్రమ దందాలు ఎన్ని జరిగిన వెలుగులోకి తీయకుండా వారు మామూళ్ళ మత్తులో మునుగుతూ అధికారులను, ప్రజా ప్రతినిధులతో మమేకమై మండలంను బ్రష్టు పట్టిస్తున్నారని మండల ప్రజలు ఆ విలేకరుల వ్యవహారం పై చర్చించు కుంటున్నారు. తాజాగా ఓ క్రషర్ యాజమాని వద్దకు వెళ్ళి మేము ప్రముఖ పత్రిక విలేకరులము మాకు నెల, నెలా మామూళ్ల్లుఇవ్వాల్సిందే అని, ఆన్లైన్ విలేకరులు వస్తే ఏమి ఇవ్వకూడదుు , మేము చూసుకుంటామని మాకైతే ఇప్పుడు పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి దసరాకు మామూలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఇటీవల మాడుగుల మండలంలో వెలుగులోకి వచ్చిన భూ దందా లో సైతం ఓ విలేఖరి ఎమ్మార్వో తో కుమ్మక్కై 19 గుంటల భూమి చేయించుకోవడంతో పాటు ఆ గ్రూపులో ఉన్న విలేకరులకు 3 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం సాగుతుండటం కోస మెరుపు. మండలంలో ఏ గ్రామంలో వెంచర్లు వెలిసిన యజమానులతో కలిసి వాటాలు కుదుర్చుకున్న తర్వాతనే పనులు మొదలు పెట్టాలని , వారి వెనుక కొంతమంది రాజకీయ నాయకుల అండ కూడా ఉందన్నట్టు ప్రచారం సాగుతుండగా వీరిపై అందరూ ఒక కన్ను వేయాలని కొందరు ప్రజా ప్రతినిధులు చర్చించుకుంటున్నారు. ప్రజలకు ప్రభుత్వలకు వారధిగా ఉండి ప్రజా సమస్యలను వెలుగు లోకి తీసుకరావాల్సిన విలేకరులే అవినీతి కి పాల్పడుతుండడంతో మండల ప్రజలు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఆ ప్రముఖ పత్రికల యజమాన్యం ఆ విలేకరులపై ఎలాంటి చర్య తీసుకుంటారో మండల ప్రజలు వేచి చూడాల్సిందే.