Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బాసర త్రిబుల్ ఐటీ యూనివర్సిటీ లంచ్ లో గాజు పెంకులు…?

 

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో మార్చ్ 10 (నిజం న్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద టెక్నాలజీ యూనివర్సిటీ బాసర త్రిబుల్ ఐటీ యూనివర్సిటీ..కానీ

బాసర త్రిబుల్ ఐటీ పియూసీ 2 మెస్ లో శుక్రవారం లంచ్ లో ఒక అబ్బాయి ప్లేట్ లో గాజు పెంకు వచ్చి కలకలం రేపుతుంది.. వివరాల్లోకి వెళితే శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేస్తుండగా పియుసి 2 మెస్ లో పెరుగన్నం తింటున్న ఒక అబ్బాయి ప్లేట్లో ఒక పెద్ద గాజు పెంకు లభ్యమయింది.

ఇటీవలే త్రిబుల్ ఐటీ బాసర యూనివర్సిటీలో 9 వేల మంది విద్యార్థిని విద్యార్థులు వారం రోజులు పాటు శాంతియుత నిరసన చేసిన సంఘటన అందరికి తెలిసిందే.. అంతకుముందు వరుసగా రెండు నుంచి మూడు నెలలు కాలంలో భోజనం, బ్రేక్ఫాస్ట్ లో కప్పలు, బొద్దింకలు, తెల్ల పురుగులు తదితర అంశాలపై పిల్లలు వారం రోజులపాటు శాంతియుతంగా నిరసన తెలిసిన విషయం అందరికి తెలిసిందే.. స్పందించిన ప్రభుత్వం, మంత్రులు యాజమాన్యం దిగివచ్చి 45 డేస్ లో మీ సమస్యలన్నీ సద్దుమనుగుతాయని హామీ ఇచ్చి వెళ్లిపోయారు.ఆరు నెలలు అయిపోయింది, సంవత్సరం దగ్గర అడుతుంది..కానీ ఎక్కడ వేసిన గోంగడ అక్కడే ఉంది.. మెస్ వెండర్లు గాని టెండర్లు గాని ఇంతవరకు ఇవ్వకపోవడం మారకపోవడం సిగ్గుచేటు, సూచనీయమని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు అంటున్నాయి.. యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, డైరెక్టర్ సతీష్ కుమార్ ఇటీవలే పేరెంట్స్ తో నిర్వహించిన మీటింగ్లో ఒక నెల రోజులు టైం ఇవ్వండి మెస్ మొత్తం టెండర్లు మార్చి మంచి మెస్ టెండర్లు వేసి మంచి మెస్ లు ఏర్పాటు చేసి పిల్లలకు న్యాయం చేస్తామని చెప్పారు.కానీ మూడు నెలలు కావస్తున్న ఇంతవరకు టెండర్లు మార్చలేదంటే దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏందో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం పియూసి 2 లంచ్ టైం లో ఒక అబ్బాయి లంచ్ పూర్తి చేసుకుని పెరుగన్నం తింటుండగా ఒక గాజు పెంకు లభ్యమయింది. ఒకవేళ ఈ అబ్బాయి చూసి చూడక తినేసినట్లయితే ఈ గాజు పెంకు కడుపులోకి పోతే ఏమయ్యేది.. పరిస్థితి ఏ విధంగా ఉండేదో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి.. నిమిషం నిమిషం విద్యార్థిని విద్యార్థులకు ఏమవుతుందోనని ఇండ్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఈరోజు ఈ గాజు పెంకు కలకలంతో మా పిల్లలు ఎట్లా ఉన్నారు..ఎలా ఉన్నారు.. ఏం తింటున్నారు అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, మంత్రులు యాజమాన్యం వెండర్లు మార్చి కొత్త టెండర్లు పిలిచి మంచి వ్యక్తులకు మంచి కాంట్రాక్టర్లకు మెస్ కాంటాక్ట్ ఇవ్వాలని తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీ విద్యార్థుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.