పాఠశాలలో ఉపాధ్యాయుని నియమించాలి

విద్యార్థి సంఘాలు పి డి ఎస్ యు, ఏఐఎస్ బి
కుబీర్ ( నిజం న్యూస్ మార్చ్ 8); కుబీర్ మండలంలోని పల్సి తండ -2 పాఠశాలలో 15 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ నెల రోజుల నుండి విద్యార్థులకు బోధించడానికి ఉపాధ్యాయుడు రాక విద్యార్థులు విద్యకు దూరమవుతున్నామన్ని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అంటున్నారు. ఇప్పటికైనా ఉపాధ్యాయుని నియమించి విద్యార్థులకు విద్యను అందించాలని విద్యార్థి సంఘాల నాయకులు విద్యశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇదే పరిధిలో ఉన్న టీచర్ పై వేధింపులు జరుగుతున్నాయని సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన సమగ్ర విచారణ చేపట్టాలని విద్యశాఖ అధికారులును విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా పల్సి తండాలో ఉపాధ్యాయిని నియమించాలని ఉపాధ్యాయులు తగాదాలకు పోకుండా విద్యార్థుల విద్యను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు అందించడంలో పూర్తి నిమగ్నమై ఉండాలని ఉపాధ్యాయ సమస్యలను విద్యాశాఖ అధికారులు పరిష్కరించాలని విద్యార్థి సంఘ నాయకులు ఇలాంటి చేస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సింగారి వెంకటేష్,రాష్ట్ర కార్యదర్శిజేవారే రాహుల్.