మహిళా సమానత్వంకై పోరాడుదాం…మావోయిస్టు పార్టీ

చర్ల మార్చి 7 (నిజం న్యూస్)
మండల పరిధిలోని లక్ష్మి కాలనీ, దేవానగరం గ్రామాల శివారులో మావోయిస్టు పార్టీ పేరుతో కరపత్రాలు వెలిశాయి.
మార్చి 8, అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని
మహిళలపై జరిగే రాజ్యహింసకు, బ్రాహ్మణీయ హిందుత్వ
ఫాసిజానికి వ్యతిరేకంగా జరుపుకుందాం!
మహిళా విముక్తికై పోరాడుదామని అందులో పేర్కొన్నారు.
జర్మన్ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు క్లారాజెట్కిన్ నాయకత్వంలో 1910లో
కొపెన్హాగెన్లో అంతర్జాతీయ రెండవ సోషలిస్టు
మహిళా మహాసభ జరిగింది. ఈ సభలో అంతర్జాతీయంగా జరిగిన శ్రామిక మహిళల పోరాటాలను ప్రేరణగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా పీడిత వర్గాల మహిళలను సంఘటితం చేసే లక్ష్యంతో మార్చి 8 ని పోరాట దినంగా జరుపుకోవాలనే తీర్మానం జరిగింది.
ఈ సంవత్సరం 113వ అంతర్జాతీయ మహిళా దినాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.
మహిళల అభివృద్ధి పేరుతో నేటి పాలకవర్గాలు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాలలో అవకాశాలు కల్పిస్తూ మహిళలను ముందుకు
తీసుకొస్తున్నట్లు కపట ప్రేమను ప్రకటిస్తున్నాయి. బేటీ బచావో-బేటీ పడావో, షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి. ఒంటరి, వితంతు,
వృద్ధాప్య మహిళా పెంన్షను, ఆపద్బంధు, అంత్యోదయ లాంటి ప్రభుత్వ పథకాలు ప్రచారానికి తప్ప మహిళల అభివృద్ధి, ఆత్మగౌరవంతో.
సాధికారతతో జీవించడానికి ఉపయోగపడవు. వీటి వల్ల ఏ విధమైన అభివృద్ధి జరగక పోగా మహిళలపై అన్ని రంగాలలో లైంగిక
వేధింపులు పెరిగాయి.
ఈ వ్యవస్థ మహిళలను ఒక సరుకుగా తప్ప మనిషిగా గుర్తించడం లేదని పేర్కొన్నారు..
ఈ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాడవలసిన అవసరం ఎంతో ఉంది. ఈ మనువాద సిద్ధాంతాలకు, పితృస్వామ్య
విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఈ దోపిడీ సమాజం నుండి విముక్తి కాకుండా స్త్రీ విముక్తి సాధ్యం కాదనేది సత్యం. అందుకోసం
మహిళలందరం స్త్రీ విముక్తి పోరాటాలలో భాగస్వామ్యం అయి స్త్రీ విముక్తిని సాధిద్దాం.
ఈ పాలవవర్గ విధానాలకు వ్యతిరేకంగా వివిధ వర్గాల, కులాల, మతాల మహిళల అస్తిత్వానికి ప్రమాదంగా మారడంతో తమ
త్యాగాలతో, బలిదానాలతో ముందుకు సాగుతున్న మహిళా పోరాటాలను ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళల పోరాటదినం సందర్భంగా
సమున్నతంగా ఎత్తిపడుతూ ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోదాం.
పీ-పురుష సమానత్వంకై పోరాడుదాం
ఉన్న మహిళలు సమానహక్కుల కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు.