ప్రజా సేవలో అత్తా కోడళ్ళు

కుటుంబం పూర్తిగా ప్రజా సేవకు అంకితమై ముందుకు సాగుతూ
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
మణుగూరు మార్చి 6 (నిజం న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం నందు, శేషగిరి నగర్ గ్రామ నివాసి అయిన భూక్యా కాంతమ్మ, భూక్యా తార ఇద్దరు అత్త కోడళ్ళు
కోడలు తార, టీచర్, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా లయన్స్ క్లబ్ మణుగూరు సెక్రటరీ గా , నేను సైతం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షరాలుగా, అమ్మ నాన్న వృద్ధాశ్రమం నిర్వాహకులుగా పలు భాద్యతలు నిర్వహిస్తూ ఉన్నారు
మామూలుగా ప్రస్తుత సమాజంలో, అత్త కోడళ్ళ మధ్య పలు విషయాల్లో వైరుధ్యం వుంటుంది. కానీ, ఈ ఇరువురు అత్త కోడళ్లు సామాజిక బాధ్యత స్పృహ కలిగి అమ్మ నాన్న వృద్ధాశ్రమం నందు ఆశ్రయం పొందుతూ ఉన్న అనాధ వృద్ధుల సపర్యలు చేస్తూ వారి ఆలనా పాలనా చూస్తూ ప్రేమ ఆప్యాయత అనురాగాలు వృద్దులకు అందిస్తూ సామాజిక సేవలో ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో తల్లి భార్య మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా కుమారుడు భూక్యా ప్రసాద్ సూచనల మేరకు వృద్ధుల ఆలనా పాలనా చూస్తున్న కాంతమ్మ వృద్దులకు వంటలు చేసి, మహిళలకు జడ వేస్తూ, స్నానాలు చేయిస్తూ చేసే సేవ కు వ్రాసే అక్షరాలు కూడా తక్కువే. అత్త కాంతమ్మ గృహిణి,
తనకు ఓ కుమారుడు భూక్యా ప్రసాద్ , ప్రభుత్వ జూనియర్ కళాశాల అశ్వపురం కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం చేస్తూ, సామాజిక సేవలో ఎంతో చురుకుగా ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు ఒకరు గవర్నమెంట్ టిచర్ గా, మరొక కూతురు గృహిణిగా ఉన్నారు
ప్రజా సేవలో అంకితమై పని చేస్తున్న కాంతమ్మని చేస్తున్న బాధ్యతాయుతమైన సేవల గురించి అడగగా ఈ లోకంలో ఎంతో గొప్పదైనా మానవ జన్మను పొందాము. పరుల హితం కోసం పాటు పడుతూ, మనకు ఉన్నంతలో సాయం చేస్తూ ముందుకు సాగుతూ ఈ జన్మ కు మనకు మనం ఇచ్చుకునే నిజమైన బహుమానం అని అనడం, కాంతమ్మ గొప్ప మనసుకు, సేవా నిరతికి నిదర్శనం.