Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణాలో దూకుడు పెంచిన బీజేపీ

తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. తెలంగాణ రాష్ట్రం పై ప్రధానంగా ఫోకస్ చేస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం అందుకు తగినట్టుగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ప్రజలు బిజెపిని ఆదరించడం కోసం బిజెపి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది . ఒకపక్క ప్రజా గోస.. బిజెపి భరోసా బైక్ ర్యాలీలతో హోరెత్తిస్తూ, ఇంకోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ బీజేపీ ముందుకు సాగుతుంది.

ఇందులో భాగంగా ఫిబ్రవరి 7 నుండి నెల రోజుల పాటు 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రజల మద్దతు కోసం ప్రజల వద్దకు వెళుతున్న బీజేపీ నాయకులు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అధిష్టానం ఆదేశాల మేరకు కీలకంగా పనిచేస్తున్నారు. తెలంగాణా బి జె పి కీలక నాయకులందరూ ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇక వచ్చే ఎన్నికల గురించి అమిత్ షా పార్టీ శ్రేణులకు విజయమే లక్ష్యంగా పని చెయ్యాలని దిసా నిర్దేశం చేసారు.

తెలంగాణా బిజెపి వచ్చే ఎన్నికలలో గెలిచి తీరాల్సిందేనని హోం మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సభ నిర్వహించాలని, మొత్తం 119 నియోజకవర్గాలలో సభలను నిర్వహించే ఆపై, ఉమ్మడి జిల్లాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని అమిత్ షా సూచించారు. వచ్చే రెండు మూడు నెలలలో రాష్ట్రమంతటా వీధి వీధిలో కాధాయ రంగు జందాలు రెప రెపలాడాలను సూచించారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలలో ఘోరంగా విపలమయ్యింది. ప్రభుత్వ వైఫల్యలను ప్రజలలోకి బలంగా తీసుకువెళ్ళాలని అమిత్ షా సూచించారు.

నాయకులంతా తమ తమ విబేధాలను విస్మరించి ఏకతాటి మీద ఉమ్మడిగా ముందుకు సాగాలని, ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని ఉద్బోధించారు. అలాగే చేరికల పై ప్రత్యేక దృష్టి సారించాలని అమిత్ షా రాష్ట్ర నేతలకు సూచించారు.ఢిల్లీ వేదికగా తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ కీలక విషయాలపై క్లారిటీ ఇచ్చింది.సోషల్‌ మీడియాలో పార్టీ కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేసి కేసీఆర్‌ విధానాలను ఎండగట్టాలని,హర్ ఘర్ కమల్’ నినాదంతో పార్టీ ఎన్నికల గుర్తును ప్రతి ఇంటికి చేరువ చేసే దిశగా కార్యక్రమాలు ఉండాలని రాష్ట్ర నేతలకు అమిత్ షా సూచించారు.

పార్టీలో ఉండే చిన్న చిన్న మనస్పర్ధలను పక్కనపెట్టి నేతలంతా ముందుకు నడవకపోతే నష్టం జరుగుతుందని అమిత్ షా హెచ్చరించారు. ఆపరేషన్ తెలంగాణలో 90 నియోజకవర్గాలలో విజయం సాధించడానికి పక్కా ప్లాన్ తో ముందుకు సాగాలన్నారు.

సి.హెచ్.ప్రతాప్