రైతులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి…జిల్లా కలెక్టర్ శశాంక

మహబూబాబాద్ బ్యూరో మార్చి06 నిజం న్యూస్
సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ నిర్మాణం కొరకు సేకరిస్తున్న 22 మంది రైతుల నుండి ఆరున్నర ఎకరాలకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ లో సీతారామయ్య ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులకు అవసరమయ్యే భూమి సేకరణకు రెవెన్యూ అధికారులతో సీతారామ ప్రాజెక్టు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు సంవత్సరముల కాలం లీజు కొరకు తీసుకుని ఆరున్నర ఎకరాల భూమికి న్యాయబద్ధంగా సొమ్ము చెల్లించటానికి అధికారు లు సిద్ధంగా ఉండాలన్నారు. ముందుగా ఆయా భూములలో వేస్తున్న పంటలపై రైతులతో చర్చించాలని వారి ఇష్ట పూర్తిగా ఇచ్చే విధంగా అగ్రిమెంట్ చేయించుకోవాలన్నారు డోర్నకల్ లో 3.1 ఎకరాలు బుద్ధారంలో 3.28 ఎకరాలకు సంబంధించి భూమిని తీసుకోవలసి ఉందన్నారు.
రైతుల ఖాతాలకు సంబంధించి బ్యాంకు ఖాతా నెంబర్ను తీసుకొనవలసి ఉంటుందన్నారు.
రెండు సంవత్సరంల కాలం పాటు తీసుకునే భూమిలో కేవలం మెటీరియల్ డంపు చేయడానికేనని రైతులకు అధికారులు అవగాహన పరచాలన్నారు
వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ ల నుండి లీజుకు తీసుకునే భూమిలో నిర్మాణాలు ధరపై నిర్ణయం తీసుకున్న వలసి ఉంటుందని ఆయా భూముల్లో ఉన్న చెట్లు వాటి కాలపరిమితిని లెక్కించాలని అధికారుల ఆదేశించారు. పనులను వేగవంతంగా చేపట్టాలని పూర్తయిన నివేదికలను అందజేయాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్ సీతారామ ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసచారి ఆర్డిఓ కొమరయ్య కలెక్టర్ కార్యాలయ సెక్షన్ అధికారి అనురాధ భాయ్ తదితరులు పాల్గొన్నారు.