రాష్ట్ర ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు-మంత్రి సత్యవతి రాథోడ్

అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుంది
మహబూబాబాద్ బ్యూరో మార్చి 6 న్యూస్
హోళీ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల వసంతోత్సవం ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపాలని ఆకాంక్షించారు.
సంతోషం, ఔన్నత్యం, ఉల్లాసం, ఆనందాల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని శాంతి సౌఖ్యాలు నింపాలని, ఆనందకరమైన, సురక్షితమైన, రంగుల హోలీ జరుపుకోవాలని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పండుగలకు ప్రాధాన్యత పెరిగిందని, అన్ని వర్గాల ప్రజలు పండుగలను సుఖసంతోషాలతో జరుపుకుంటున్నారన్నారు.
తెలంగాణ అన్ని మతాలు, వర్గాల కలయికగా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తోందని.. హోలీ కూడా కులమతాలకు అతీతంగా ప్రజలంతా సంతోషంగా జరుపుకొనే పండుగ అని వెల్లడించారు.
చిన్నపిల్లలు హోలీ ఆడేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రసాయనాలతో కూడిన హానికరమైన రంగులతో కాకుండా సాధారణమైన సహజసిద్ధమైన రంగులు, నీటితోనే అట్టహాసంగా హోలీ పండుగను నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు.
ఈ సందర్భంగా మరోసారి రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.