సుధాకర్ గౌడ్ ప్రజల్లోకి వెళ్తే చంపేస్తాం అని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అనడం చాలా దారుణం

సుధాకర్ గౌడ్ ప్రజల్లోకి వెళ్తే చంపేస్తాం అని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అనడం చాలా దారుణం
రాజకీయ పార్టీలో బీసీ నాయకులు ఎదగకుండా చెయ్యడానికి ఇది నిదర్శనం
ఎదిగితే బీసీ నాయకులను చంపేస్తా అని బయపెడుతారా
బీసీ ప్రజలు ఓట్లు వెయ్యనిదే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీ ఎలా ఐయారు
బీసీ నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదు
బీసీ సంక్షేమ సంఘము అధ్యక్షులు ఎంబడి.చంద్రశేఖర్
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో మార్చ్ 06 (నిజం న్యూస్)
నిర్మల్:టి.పి.సి.సి.
ఉపాధ్యక్షుడు మరియు తెలంగాణా ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ గౌడ్ ప్రజల్లోకి వెళ్తే చంపేస్తాం అని ఎంపీ.కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనడం చాలా దారుణం అని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘము అధ్యక్షులు ఎంబడి.చంద్రశేఖర్ అన్నారు సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజకీయా పార్టీల్లో బీసీ నాయకులు ఎదగక పోవడానికి ఇది నిదర్శనం అని అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో బీసీ నాయకులకు సరైన పదవులు రావడం లేదని ఒకవేళ వస్తే ఇటువంటి భయాందోళనకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు దీనిపై అటు కాంగ్రెస్ పార్టీ స్పందించాలని అన్నారు బీసీ నాయకుల జోలికి వస్తే ఉరుకొము అని అన్నారు