కోమటి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి

కోమటి రెడ్డి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాము
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో మార్చ్ 06 (నిజం న్యూస్)
చెరుకు సుధాకర్ ని చంపేస్తామని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరించడాన్ని ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు బాణవత్ గోవింద్ నాయక్ తీవ్రంగా ఖండిస్తున్నారు . చెరుకు సుధాకర్ బహుజన వర్గం నుండి ఎదిగిన నాయకుడు. ఆయనను చంపుతామని బెదిరింపులకు దిగడం కోమటిరెడ్డి నల్లగొండ జిల్లాలో గత మూడు దశాబ్దాల్దుగా బహుజన వర్గాలను ఏవిధంగా అణచివేస్తున్నాడో తెలియ చేస్తుంది. గౌడ కులస్తులు ఎక్కువ జనాభావున్న పాత నల్లగొండలో రాజకీయంగా అణచివేతకు గురవ్వడానికి కోమటిరెడ్డి కుటుంబం కారణం. చెరుకు సుధాకర్ ను చంపుతామని చేసే బెదిరింపులు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం కాదు. అది సామాజిక పెత్తనానికి నిదర్శనం. చెరుకు సుధాకర్ కి ఏమి జరిగినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి వుంటుంది. కోమటిరెడ్డి కుటుంబందే బాధ్యత. తెలంగాణ పోలీసులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని ఎస్ సి ఎస్ టి ఐక్యత వేదిక జిల్లా నాయకులు రాసామళ్ళ అశోక్ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు జాదవ్ అశోక్ డిమాండ్ చేస్తున్నారు
–