బిజెపి జిల్లా ఉపాధ్యక్ష పదవికి రాపర్తి శ్రీనివాస్ గౌడ్…… రామ్ రామ్, త్వరలో బి ఆర్ఎస్ లో చేరిక

సూర్యాపేట ను అభివృద్ధిలో ఆదర్శంగా చేసిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డిదే!
– మేనిఫెస్టోలో చెప్పని హామీలను అమలు చేసి చూపించిన మంత్రి జగదీశ్ రెడ్డి
– మంత్రి జగదీష్ రెడ్డి అడుగులో అడుగు వేసేందుకు త్వరలో టిఆర్ఎస్ లో చేరిక
బిజెపి పార్టీకి జిల్లా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రాపర్తి శ్రీనివాస్ గౌడ్.
సూర్యాపేట ప్రతినిధి ఫిబ్రవరి 28 నిజం న్యూస్
ఓట్లు కాదు….. నాకు ముఖ్యం సూర్యాపేట అభివృద్ధి ప్రధానమని భావించి రోడ్ల వెడల్పుకు పూనుకొని సూర్యాపేటను అభివృద్ధి పథంలో నడిపిస్తూ తెలంగాణ రాష్ట్రానికే తలమానికం చేసిన ఘనత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కె దక్కుతుందని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రాపర్తి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సోమవారం స్థానిక ఎస్ఆర్ఎన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్న తాను ఆ పార్టీకి, జిల్లా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించార. గత పది సంవత్సరాల కాలంలో సూర్యాపేట జిల్లా తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి అభివృద్ధికి ఆకర్షితుడినై త్వరలో బిఆర్ఎస్ లో మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలిపారూ. సూర్యాపేట నియోజకవర్గం చరిత్రలో సూర్యాపేట ను అభివృద్ధి చేసిన నాయకుడు జగదీశ్ రెడ్డి మాత్రమే అన్నారు. కళ్లకు కనబడుతున్న అభివృద్ధిని కాదనలేమని మూసి మురికి కూపం నుండి విముక్తి కల్పించి, స్వచ్ఛమైన జలాలను అందించిన ఘనత జగదీష్ రెడ్డిదే అన్నారు. ప్రతి మండలంలో చివరి ఆయకట్టు వరకు గోదావరి జలాలతో సాగునీరు పందించి సస్యశ్యామలం చేశాడన్నారు. సూర్యాపేట నియోజకవర్గం లో ఎంతోమంది శాసనసభ్యులు పనిచేసిన కూడా కనీసం ప్రభుత్వడిగ్రీ కళాశాల తేలేకపోయారని కానీ ఎవరూ ఊహించని విధంగా మెడికల్ కాలేజీని తెచ్చిన ఘనత జగదీశ్ రెడ్డి గారిదే అన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు నిలయమైన సద్ధల చెరువు, పుల్లారెడ్డి చెరువులను ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాడన్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం తాపత్రయ పడకుండా ప్రజల సౌకర్యమే ముఖ్యమని రోడ్లు వెడల్పు చేసి అభివృద్ధికి బాటలు వేశారన్నారుఏ ఊరు వెళ్ళిన ఏ తండా వెళ్లిన ప్రతిచోట సిసి రోడ్ల వేసిన ఘనత మంత్రి కే దక్కుతుందన్నారు. *2014 ముందు ఏ పేదవానికి జబ్బు చేసిన బిల్లులు కట్టలేక దీనావస్థలో స్మశానం వైపు చూసే పరిస్థితి ఉండే కానీ జగదీశ్ రెడ్డి గారి పుణ్యమా అని ఎంత ఖరీదైన వైద్యమైనా,మా కుటుంబ పెద్ద జగదీష్ రెడ్డి ఉన్నాడని ధైర్యంతో ఈరోజు ప్రతి పేదవాడు ధైర్యంగా ఉన్నారన్నారు. కోట్ల రూపాయలతో పేదవాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ ల ద్వారా వైద్యాన్ని అందించిన ఘనత కూడా జగదీశ్ రెడ్డిదే అన్నారు. నియోజకవర్గ మొత్తాన్ని తన కుటుంబం గా భావిస్తున్న నాయకుడు జగదీశ్ రెడ్డి అని నియోజకవర్గ ప్రజలు కూడా తమ కుటుంబ పెద్దగా జగదీశ్ రెడ్డి గారిని భావిస్తున్నారని అన్నారు. అటువంటి వ్యక్తి కుటుంబంలో నేను కూడా సభ్యునిగా ఉండాలని అది నా బాధ్యతగా భావిస్తూ ఈరోజు బిజెపి పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ తోనూ జగదీశ్ రెడ్డి గారితో నడవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. త్వరలో వారి సమక్షంలో కార్యకర్తలు తోపాటు జాయిన్ అవుతానని తెలిపారు.
ఈ సమావేశంలో 29వ వార్డు బిజెపి అధ్యక్షుడు రాపర్తి రాము, 28వ వార్డు గత కౌన్సిలర్ అభ్యర్థి రాపర్తి రమేష్, బిజెపి యువమోర్చా పట్టణ ఉపాధ్యక్షుడు కెక్కిరేణి ఆనంద్, పట్టణ బిజెపి నాయకులు రాపర్తి మహేష్, కెక్కిరేణి శివకుమార్, రాపర్తి సంజయ్, గుండగాని కుమార్ తదితరులు పాల్గొన్నారు….