విద్యాసంస్థల్లో పర్యవేక్షణ కమిటీలు — టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయాలి

ఎం డి జహంగీర్…సిపిఎం జిల్లా కార్యదర్శి
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ఫిబ్రవరి 27 (నిజం న్యూస్)
మెడికో డాక్టర్ ప్రీతిని వేధించిన నిందితుని కఠినంగా వెంటనే శిక్షించాలని సోమవారం రోజున జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ చౌరస్తాలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసినారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ మెడిసిన్ డాక్టర్ ప్రీతి సీనియర్ వేదింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎం లో ఆత్మహత్యకు ప్రయత్నించి నిమ్స్ లో చికిత్స తీసుకుంటూ మృతి చెందడం అత్యంత బాధాకరం. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ,ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి పర్యవేక్షణ కమిటీలు, కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేస్తూ, డాక్టర్ ప్రీతి మృతి పట్ల సంతాపం వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాం అన్నారు..ఇటీవల కాలంలో రాగింగ్ సీనియర్ల వేధింపులు పని ఒత్తిడి తదితర కారణాలవల్ల విద్యార్థుల్లో తీవ్ర మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న వరంగల్ లోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని తోటి విద్యార్థులు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడి లోనై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆందోళన కలిగిస్తుంది. ప్రతి విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు చేయాలనే, 1997లో ర్యాగింగ్ నిరోధక చట్టం మరియు 2009లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నప్పటికీ ఈ కృషి జరగడం లేదు.2022 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 32 ర్యాగింగ్ కేసులు యు సి జి కి వచ్చినట్లు స్వయంగా కేంద్రం మానవ వనరుల శాఖనే పేర్కొన్నది ,అంటే ఎంతో ప్రమాదకరంగా ఉన్నదో అర్థమవుతుంది ,ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం,ఎంతో కొంత ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప దీనిపై ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచడం లేదన్నారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ను నిరోధించేందుకు యు జి సి ర్యాగింగ్ మార్గదర్శకాలు పాటించాలని, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేసి ఆయన నెంబర్లను బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రతి విద్యా సంస్థల్లో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని కమిటీల్లో తల్లిదండ్రుల తో పాటు సైక్రాటిస్టు సైకాలజిస్టులను కూడా భాగస్వాములను చేసి తరచుగా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సురక్షితమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు కాలేజీ విద్యార్థులపై ర్యాగింగ్ చేసే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్, కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి ,దయ్యాల నరసింహ, మాయ కృష్ణ ,గంగదేవి సైదులు, బూరుగు కృష్ణారెడ్డి, సిర్పంగి స్వామి, దోడ యాదిరెడ్డి, గుండు వెంకట్ నర్సు ,గడ్డం వెంకటేష్, వనం ఉపేందర్, మండల కార్యదర్శులు దూపటి వెంకటేష్, రేకల శ్రీశైలం, పోతరాజు జహంగీర్, బండారు శ్రీరాములు, వేముల బిక్షపతి, నాయకులు తుర్కపల్లి సురేందర్, చీరిక సంజీవరెడ్డి ,గాడి శ్రీనివాస్, ప్రసాదం విష్ణు తదితరులు పాల్గొన్నారు.