అధికారుల కనుసైగల్లో ఇసుక దందా

మోతె ఫిబ్రవరి 27 (నిజం న్యూస్):- అధికారుల కనుసైగల్లో అక్రమంగా ఇసుక దందా నడుస్తుంది మండల పరిధిలోని నర్సింహాపురం కూడలి, రాయికుంటతండా, బుర్కా చర్ల, తుమ్మ గూడెం, నేరడవాయి గ్రామాలలో నిత్యం అడ్డు అదుపు లేకుండా అక్రమంగా సాగిస్తున్న ఇసుక దందాను అధికారులు రాజకీయ నాయకుల కను సైగలతో సాగిపోతున్నదని మండలం లోని ప్రతీ ఒక్కరు చర్చించుకుంటున్నారు. వర్ష కాలంలో నర్సింహాపురం బ్రిడ్జి క్రింద వరదలను సైతం వడిసి పట్టి ఇసుక దందా సాగిస్తున్నారు అడ్డు అదుపు లేకుండా సాగించే ఈ ఇసుక దందాను మధ్య దళారీలు సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ అధికారులను ప్రజా ప్రతినిధులనుఅడ్డం పెట్టుకొని సాగిస్తున్న ఇసుక దందాను అరికట్టే నాథుడే కరువైనట్లు కన్పిస్తున్నది అనుమతులు లేని ట్రాక్టర్ లు కనీసం టి ఆర్ నెంబర్ లేకుండా చేస్తున్న అక్రమ ఇసుక దందా ఏ తరహా లో కొనసాగుతుందో ఇట్టే అర్ధం అవుతుంది అక్రమంగా తరలించే ఈ ఇసుక ట్రాక్టర్ లతో గ్రామాలలో రోడ్లు పూర్తి స్థాయిలో దెబ్బతిని రాక పోకలకు ఇబ్బందులు ఎదురకొంటున్నట్లు అయా గ్రామాల ప్రజలు చర్చించు కుంటున్నారు.